Friday, February 16, 2018

చిత్రకవిత- ఏవీ ఆ రోజులు?



ఏవీ ఆ రోజులు?
బ్రతుకు బండి లాగి, వీధులన్నీ తిరిగి
బ్రతుకు తరువు సంపాదించుకున్న రోజులు...
సముద్రపు నీటి నుండి,
ఉప్పును వేరు చేసే చాకచక్యం
మా ఉప్పర్లకే ఉన్నాయనుకున్న రోజులు...
ఇంటి ముందు “ఉప్పోప్పోయ్” అనే కేక వెయ్యగానే
ఇల్లాలి కన్నా ముందు పిల్లలు మా చుట్టూ తిరిగిన రోజులు...
వచ్చిన ఆ పిల్లలకి సముద్రం నీటిలో ఉప్పు
ఎలా కలిసిందో కథలు చెప్పే రోజులు...
 ఏవీ ఆ రోజులు?
యంత్రం వచ్చి మా జీవనోపాధిని
తుడిచి పెట్టేసిన రోజులు...
బండి లాగిన అనుభవంతో
సామాన్లు లాగుతున్న రోజులు...
మా నైపుణ్యాన్ని మంటగలిపి
బ్రతుకు బండి లాగిస్తున్న ఈ రోజులు...
ఇవీ ఈ రోజులు...


*****

No comments: