Wednesday, February 28, 2018

చిత్రకవిత- ఎంత కాలమీ గడ్డు కాలం?



ఎంత కాలమీ గడ్డు కాలం?
ఉండడానికి చెట్లు కరువు
తినడానికి స్వచ్ఛమైన గింజలు కరువు
వాలడానికి చెట్టుకొమ్మలు కరువు
ఇళ్ళలో గూడు కట్టాలంటే ఎలా?
లోపలికి వెళ్ళే దారేది?
పోనీ, పల్లెలకు పోదామంటే
అక్కడ పంట పొలాలను మార్చి
ఇళ్ళు కట్టేస్తున్నారుగా!
మరెలా బతకాలి ?


మా ఉనికికి ఇబ్బంది వస్తే
దాన్ని నివారించాకుండా
మేం కనబడితే చాలు
సేల్ఫీలని ఎగబడతారు
ఈ తుచ్ఛ మానవులు
వీళ్ళకేమయ్యింది?
మా కిలకిలారావాలతో
లేవాలని లేదా?
మా పిచ్చిగానీ
మా కిలకిలలని
అనుకరిస్తున్న అలారంలు వాళ్ళకుంటేను?
వీళ్ళని మోస్తున్న
ఈ భూమికేమయింది?
ఒక పక్క ఓజోన్ పొర సన్నగిల్లుతోంది
మరోపక్క చరవాణి వేడి పెంచుతోంది
ఈ కాలుష్యం, వేడిల మధ్య
ఎంత కాలమీ కష్ట జీవితం?
ఎంత కాలమీ గడ్డు కాలం?

****

No comments: