Saturday, February 3, 2018

గద్య పూరణము- keywords- 'వహ్వా' అను వంటకాలివి మా యింట

1.     కర్రీ పాయింట్ లో కొన్న వంకాయ కూర
శాంబాగ్ నుంచి తెచ్చిన సాంబారుండగ
'వహ్వా' అను వంటకాలివి మా యింట నుండ
వంట చేయు అవసరము మాకేల?


2.     కొత్తజంట భోజనానికి పిలిచిరి ప్రేమగా
పాకం గారెలు నేతి బూరెలు ఫాషన్ కాదు అంచు
పిజ్జా-బర్గర్లు- ఫ్రెంచ్ ఫ్రైలు వడ్డించిరి
 'వహ్వా' అను వంటకాలివి మా యింట నుండయని.

3.     'వహ్వా' అను వంటకాలివి మా యింట నుండ
యని చెప్పు అవసరము మాకెప్పుడును లేదు
మా అమ్మ చేతి వంట అమృతపు పంట
దానిని తిన్న వారలే కదా అదృష్టవంతులన్న!

4.     బంగాళా భౌ భౌ, అరటిపండు లంబాలంబా చేసి
'వహ్వా' అను వంటకాలివి మా యింట నుండ యన్న
ఏం లాభం? ముద్దపప్పులో నెయ్యి జోడించి తినిన
స్వర్గానికి చేరువగా చేరిపోమే?

*************

No comments: