Tuesday, February 20, 2018

చిత్రకవిత- నా చిట్టితండ్రి బరువౌతాడా?


నా చిట్టితండ్రి బరువౌతాడా?
జన్మభుమిలో ఆకలి, వలసను ప్రేరేపించింది
నా భర్త ముందు వలస పోయాడు
నెలలబిడ్డతో నా ప్రస్థానం ప్రారంభమయ్యింది

చదువు సంధ్యలు లేని నాకు కూలిపనే గతి
దేవుడిచ్చిన దేహదారుఢ్యాన్ని పనిలో పెట్టాను
నా భర్త సంపాదించే వేన్నీళ్ళకి
నా చన్నీళ్ళు తోడయ్యాయి
(ఇద్దరమూ వేన్నీళ్ళు సంపాదించుకునే
పరిస్థితి లేదు కదా!)

మగవారు సైతం మోయడానికి వెరసే
దుంగలని అవలీలగా మోసెయ్యగలను
అలాగని తల్లిగా నా బాధ్యతని ఏనాడూ
నిర్లక్ష్యం చేయనుగాక చేయను.
బరువైన దుంగలని మోసే నాకు
పసికందైన నా చిట్టితండ్రి బరువౌతాడా?

**********

No comments: