Saturday, February 17, 2018

గద్య పూరణము- keywords- పలకరించినంత పులకరించును


1.     విలువలు మృగ్యమగు ఈ కాలమున
విలువలను గౌరవించు వాక్యములు
పలకరించినంత పులకరించును నా మది
చదివినంతనే సంతోషము పెల్లుబుకున్.


2.     అప్పుడే పుట్టిన చంటిపాపని చూసి
తల్లి మనసు ఆనందముతో ఊగిపోవ
ఆ పసికందు బోసి నవ్వులు రువ్వుతూ,
పలకరించినంత పులకరించును గదా!

3.     పలకరించినంత పులకరించును మన
మంచు ఆమె వెంట పడెనో శుంఠ
రోడ్ రోమియో మాదిరి వేధించగా
పోలీసులతనికి చేసిరి తగిన శాస్తి.

4.     ప్రేమ పుట్టిన కొత్త జంట ఒకరినొకరు
పలకరించినంత పులకరించును హృది
ప్రేమయన్న ఒక మైకము గాదె
పలకరించినంత పులకరింపు గల్గ.

5.     ప్రేమ విఫలమైన ఒక పిచ్చి వానిని స్త్రీలు
పలకరించినంత పులకరించును
వాని మది పాపమతని మనసు
కుదుటపడి పిచ్చి కుదురు గాక!

****

No comments: