Wednesday, February 21, 2018

గద్య పూరణము- keywords- "భార్యకు సేవ చేయునట్టి భర్త తరించున్"

1.     భార్య స్థానం భర్త పాదాల చెంత యన్న
మనిషి వింత మృగమని జెప్పవచ్చు
భార్యకు సేవ చేయునట్టి భర్త తరించున్
అను వాడుగదా భర్తయన్న!


2.     భార్యకు సేవ చేయునట్టి భర్త తరించున్
అనుచుందురు ఈ కాలపు భర్తలు
కారణమేమని యోచింపగా స్ఫురియించెనది
వారి తల్లుల పెంపకమ్మహిమయని.


3.     మామ గారికి కోపము వచ్చెనేలననగా
‘భార్యకు సేవ చేయునట్టి భర్త తరించున్’ అనెను
నా భర్త, ఆయన కోపము తగ్గించుట కొరకు
మా అత్తగారు పడ్డ కష్టమింతింత గాదు సుమీ!

4.   బుద్ధిమంతుడౌ భర్త ఎట్లుండవలెనని
అడిగెను నా పుత్రిక ఆసక్తిగా, నే చెప్పితినిట్లు
భార్యను గౌరవించువాడు తన సొంతమౌవాడు
“భార్యకు సేవ చేయునట్టి భర్త తరించు”ననువాడు.

5.   “భర్తకు సేవ చేయునట్టి భార్య తరించున్”
ఇది నాటి మాట కాని గొప్ప గాదు
“భార్యకు సేవ చేయునట్టి భర్త తరించున్” తప్పే
భార్యాభర్తలొకరికొకరు సేవలు చేయవలెను.

******************************

No comments: