I grew up on the East Coast of India, so I'm particularly fond of the Sun and the Sea and hence the title which means sea shore in Telugu. If everyone saw the best of photographs, and read only the best writings, where's the opportunity for the alsorans to showcase their talents( or the absence of them)?
Tuesday, October 31, 2017
Sunday, October 29, 2017
చిట్టి కథ - guiding sentence- "బస్టాండులో అదాటుగా ఆమె/ అతను...కళ్ళముందు వెలుగు వెల్లువ "- వెల్కమ్ బ్యాక్
వెల్కమ్ బ్యాక్
చేతికి గుడ్డ సంచీ
తగిలించుకుని, చెప్పులేసుకుని, ఇంటికి తాళంపెట్టి కలీడ్చుకుంటూ బస్టాండు వైపు
నడిచింది వసంత. ఆమె తన బాధ్యతని ఒక మరమనిషిలా నిర్వర్తిస్తోంది. తీసుకునే జీతానికి
మాత్రం న్యాయం చేస్తోంది. ఎటొచ్చీ వ్యక్తిగతంగా ఆమె జీవితంలో గుర్తు చేసుకుని
పొంగిపోయే క్షణాలు లేవని అనుకుంటూ వెళ్ళేసరికి గజపతినగరం బస్టాండు రానేవచ్చింది.
వెంటనే ఒక బస్సు వచ్చింది కానీ అది చీపురుపల్లి వెళ్ళేది. సాలూరు వెళ్ళే బస్సు
ఎప్పుడొస్తుందా అని బస్సు రావలసిన దిక్కుకేసి తదేక దృష్టితో చూస్తోంది.
Tuesday, October 24, 2017
Thursday, October 19, 2017
చిట్టి కథకి ముగుంపు మీదే - చూసినవన్నీ..
Given Story:
" నానింక సెయ్యలేను బావూ "
" అలా అంటే ఎలా చిట్టెమ్మా"
" మీరు పుట్టినప్పట్నుండీ మీ ఇంట్లో పని సేత్తన్నాను కదా. .
ఇక నాకు ఓపిక
నేదు... నాకు
సెలవిప్పించండి
"
" అది కాదు చిట్టెమ్మా... నీ అంత నమ్మకస్థులు మాకు ఎక్కడ దొరకుతారు ?"
" ఏం నమ్మకాలో ఏమో...మనుసులు పెద్దయితే మనసులు
పెద్దవ్వాలి కద బాబూ "
Tuesday, October 17, 2017
Monday, October 16, 2017
చిట్టి కథ- Keywords- " చెమ్మగిల్లిన ఆ కళ్ళు వినూత్న అనుభూతికి సాక్ష్యాలు... "requirement- ఆర్ద్రత"- అపార్థం
“లల్లీ, ఏమిటి ల్యాండ్ లైన్ ఎత్తవు?” కోపంగా అన్నాడు శంకర్.
‘అబ్బే, లేదండీ, అది డెడ్ అయ్యింది”, అని కంగారుగా జవాబిచ్చింది లలిత. విషయం చెప్పేసి ఫోన్
పెట్టేశాడు శంకర్. సాయంత్రం ఇంట్లోకి వస్తుండగా ల్యాండ్ లైన్ మోగడం గమనించాడు. అలసిపోయున్న
ఆటను విసుగ్గా, “ఇదెలా మోగుతోంది? పొద్దున్నే డెడ్ అయ్యిందన్నావుగా?” అన్నాడు. “వాళ్ళకి
కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు లేనట్టున్నారు, మూడింటికొచ్చి రిపేర్ చేసేశారు”,
జవాబిచ్చింది లలిత. కొన్నాళ్ళకి ఆఫీసులో తలనొప్పి వచ్చిన శంకర్ పదకొండు గంటల
ప్రాంతంలో ఇల్లు చేరాడు.
చిట్టి కథ- Keywords- " మధ్యలో జోక్యం చేసుకుంటున్నందుకు మన్నించండి " అని వినిపించింది గుంపులో నుండి ఓ స్వరం..- అవసరమైన సాయం
ఉద్యోగానికి వెళ్ళే దారిలో
బస్సుస్టాప్ దగ్గర అనూరాధ ఓ గుంపును గమనించింది. స్వతహాగా నాయకత్వ లక్షణాలున్న
మనిషి గనుక ‘నాకెందుకులె’మ్మనకుండా కారునాపి రోడ్ దాటడానికి యత్నించింది. నేల మీద
ఒక స్త్రీ పడిపోయుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు స్పృహ తెప్పించడానికి నీళ్ళూ,
సోడా వగైరాలు పోస్తున్నారు. “ఎవరో ఒకరు 108కి ఫోన్ చెయ్యండి”, అని మొబైలులోతను
ఎవరితోనో మాట్లాడుతూ ఆదేశాలిస్తున్నాడొకాయన.
Sunday, October 15, 2017
Friday, October 13, 2017
"ఈ చిట్టికథకు ముగింపు మీదే! '- అసలు కారణం?
Given Story:
ఊడిన పంచె మెడచుట్టూ వేసుకుని వదులైన నిక్కరులాంటి
పంట్లాంతో ఓ బొజ్జాయన వగరుస్తూ...పరుగో పరుగు! అతడిని వెంబడిస్తూ కాలనీలో ఓ
గుంపు...బొజ్జాయన ఏ సందులో దూరినా వెంబడించే గుంపులో జనం పెరుగుతునే ఉన్నారు...కొందరి
చేతిలో పొడుగాటి కర్రలు...మరికొందరి చేతిలో రాళ్ళూ...చోద్యం చూస్తూ
కిటికీల్లోనుండి భార్యామణులు...
Wednesday, October 11, 2017
Monday, October 9, 2017
" ఈ చిట్టికథకు ముగింపు మీదే " - ఆశ్రమం
Given Story:
కారు శరవేగంగా పరుగెడుతోంది. తండ్రీ
కొడుకులిద్దరి మధ్య నిశ్శబ్దం...
డ్రైవింగ్ సీట్లో కొడుకు.
" ఒకసారి కారు ఆపు
బాబూ "
" ఎందుకు "
Sunday, October 8, 2017
Thursday, October 5, 2017
" ఈ కథకు ముగింపు మీదే "- నాకు మీ గతి పట్టించద్దు
" ఒక్కసారి
ఆలోచించు బాబూ "
" ఏంటమ్మా
ఆలోచించేది...
పెద్దవారితో ఇలా మాట్లాడ్డం తప్పే కానీ మీకు
సిగ్గూ లజ్జా లేకుండా పోయింది... ఏం మొహం పెట్టుకొని ఈ ప్రతిపాదన నా దగ్గర
తెచ్చావమ్మా "
" అది కాదు కన్నా
"
Subscribe to:
Posts (Atom)