Given Story:
ఫ్లైట్ దిగిన వినయ్ భారత నేలని నమస్కరించాడు.ఒక్కసారిగా ఒళ్ళు పులకరించింది.
కుటుంబంతో కంటకాపల్లి పయనమయ్యాడు. నూట ఎనభై కిలోమీటర్లు. ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఉక్కరిబిక్కిరి చేస్తూ గోలగోలగా జనుల ఘన స్వాగతం. విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు
గడించిన వినయ్ పల్లెటూళ్ళో స్థిరపడబోతున్నారన్న
వార్త తెలిసి ఆశ్చర్యపోతూ ఆసక్తిగా అడిగాడు శుభోదయ
విలేకరి.. "
అనాధగా ఈ ఊళ్ళో
చిన్నప్పుడు తిరుగాడే వాణ్ణి... ఈ ఊరి ప్రజలు
నన్ను అక్కున చేర్చుకుని వంతుల
వారిగా వారాలబ్బాయిగా
అంతులేని ప్రేమ అందించారు.చద్దన్నం పెట్టారు.పప్పు
ముద్దన్నం పెట్టారు. చదువుపై నా ఆసక్తి గమనించి చందాలతో బలీయ బంధాన్ని
ఏర్పరిచారు.ఇష్టపడి కష్టపడి
చదువుకున్న నాకు విదేశాల్లో ఉన్నత
పదవులు స్వాగతించాయి. ధనం కీర్తి లభించింది. సంతృప్తి చెందాను. ఇప్పుడు నా వంతుగా
పల్లె తల్లి సేవ చేసి రుణం
తీర్చుకోవాలని..."
My Conclusion:
నైతిక బాధ్యత
“అంటే మనం ఇక్కడే ఉండిపోతున్నమా వినయ్?”, గద్దించింది అతని
భార్య కుసుమ. “అన్నాను కదా, మాతృ ఋణం తీర్చుకోవాలంటారు, నా తల్లెవరో తెలియదు కనుక
కంటకాపల్లి ఋణం తీర్చుకోవాలని!” అన్నాడు
వినయ్, మధ్యాహ్నం ఒక కునుకు తీసే యత్నంలో. “డబ్బిస్తావనుకున్నాను గాని మకాం
మార్చేస్తానని నాతో మాట వరుసకైనా అనలేదేం?”అంది కుసుమ. మనిద్దరివీ ఒకేలాంటి
ఆలోచనలు గనుక నీకూ ఇష్టముందనుకున్నాను”, అన్నాడు వినయ్.