I grew up on the East Coast of India, so I'm particularly fond of the Sun and the Sea and hence the title which means sea shore in Telugu. If everyone saw the best of photographs, and read only the best writings, where's the opportunity for the alsorans to showcase their talents( or the absence of them)?
Wednesday, February 28, 2018
Wednesday, February 21, 2018
గద్య పూరణము- keywords- "భార్యకు సేవ చేయునట్టి భర్త తరించున్"
1. భార్య స్థానం భర్త పాదాల
చెంత యన్న
మనిషి వింత మృగమని
జెప్పవచ్చు
భార్యకు సేవ చేయునట్టి భర్త
తరించున్
అను వాడుగదా భర్తయన్న!
Tuesday, February 20, 2018
Saturday, February 17, 2018
చిట్టి కథ- keywords- "కలలు కన్న దేశంలోకి అడుగుపెట్టాక.... కన్న దేశం కలలలోకి వస్తోందిరా"- మాట రాని మౌనమిది
మాట రాని మౌనమిది
ఆనందరావు డ్యూటీ ముగించి, ఇంటికి వచ్చి, కాస్సేపు టీవీ చూసి, ఎప్పటిలాగే
చపాతీపిండి కలిపి, వాటిని వత్తసాగాడు. ఈ మాటు చుక్కా రొట్టె చేసుకుందామనుకుని, రొట్టెని
నిప్పు మీద కాలుస్తున్నప్పుడు చెయ్యి కాల్చుకున్నాడు. ఆ మంట తన గుండెల్లో
రగులుతున్న చిచ్చుని బయటపడేలా చేసింది. అమాంతం గతంలోకి వెళ్ళాడు.
గద్య పూరణము- keywords- పలకరించినంత పులకరించును
1.
విలువలు మృగ్యమగు ఈ
కాలమున
విలువలను గౌరవించు వాక్యములు
పలకరించినంత పులకరించును నా మది
చదివినంతనే సంతోషము పెల్లుబుకున్.
Friday, February 16, 2018
Thursday, February 15, 2018
చిట్టి కథ - Sentence- "ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది...."- ప్రేమించేది ఎవరిని?
ప్రేమించేది ఎవరిని?
“సారీ సార్, ఈ మాటు కూడా మీ ఆవిడకు గర్భం
కలగలేదు. మీకు ముందే చెప్పాను, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భాన్ని ధరించడం కష్టమని.
మీరు మూడు సార్లు ప్రయత్నించారు, దేవుడు దయ తలచలేదు”, అంది డా|| సుమన సాగర్ తో.
“నేను ముందు ప్రేమించేది కృష్ణవేణిని. ఆమె కన్న బిడ్డ నాకు ప్రయారిటీ కానేకాదు”,
అన్నాడు సాగర్ తొణక్కుండా. “మరో విషయం. ఆవిడకి గర్భసంచీ నిండా ఫైబ్రాయిడ్స్
ఉన్నాయి. ప్రస్తుతానికి మేనేజ్ చేయవచ్చు. భవిష్యత్తులో ఎలా అవుతుందోనన్న భయంతో హిస్టరెక్టమీ,
అంటే గర్భాసంచీని తీసేస్తే నయం. అప్పుడు ఆవిడ తల్లి అయ్యే అదృష్టాన్ని జీవితాంతం కోల్పోతారు”,
చల్లగా చెప్పింది డా|| సుమన. ఆ మాట విన్న వెంటనే సాగర్ మొహం చిన్నబోయింది.
Monday, February 5, 2018
గద్య పూరణము- keywords- అమ్మ, నాన్న
1. అమ్మ నేర్పిన మంచితనము,
నాన్న నేర్పిన విలువలు చాలు
ఈ ప్రపంచములో బ్రతుకుటకై
వేరు విద్యలు నేర్వ అవసరమా?
Saturday, February 3, 2018
గద్య పూరణము- keywords- 'వహ్వా' అను వంటకాలివి మా యింట
1. కర్రీ పాయింట్ లో కొన్న
వంకాయ కూర
శాంబాగ్ నుంచి తెచ్చిన
సాంబారుండగ
'వహ్వా'
అను వంటకాలివి
మా యింట నుండ
వంట చేయు అవసరము మాకేల?
Thursday, February 1, 2018
చిట్టి కథ - Sentence- ఆమె ఆవేశంగా మాట్లాడుతుంటే అతను తలదించుకుని నిశ్శబ్దంగా వింటున్నాడు...చుట్టూ గుమిగూడిన జనం సాక్షిగా...- తల దించుకోక ఏం చేస్తాడు?
తల దించుకోక ఏం చేస్తాడు?
ఆమె పేరు భ్రమరాంబ.
ఆ రోజే రైల్వేలో ఆర్పీఎఫ్ కాన్స్టేబుల్ గా చేరింది. స్టేషన్ లో ఉద్యోగం. చేతిలో
లాఠీ పట్టుకుని అటూ-ఇటూ కలయజూస్తూ తిరుగుతూంటే భలే త్రిల్ ఫీల్ అయింది. అవదు మరి? వాళ్ళ
ఊరు నుండి ఒక పోటీ పరీక్షలో ఎక్కువ మార్కులతో పాస్ అయిన మొట్టమొదటి మహిళ ఆమె.
Subscribe to:
Posts (Atom)