Monday, July 2, 2018

చిత్రకవిత- పొగ వదలకు- ప్రాణాన్ని వదులుకోకు




పొగ వదలకు- ప్రాణాన్ని వదులుకోకు
‘నేను గురజాడ వారి అభిమాని’నని
గిరీశాన్ని ఆదర్శంగా తీసుకునే ఓ వెర్రి కుర్రవాడా!
గిరీశం ద్వంద్వ ధోరణి మరిచావా?
‘కన్యాశుల్క’పు వ్యంగ్య వైభవాన్ని విడిచావా?
ధూమపానం చేయకపోతే దున్నపోతై పుట్టుదువు గాక!
కాన్సర్ రోగిలా చచ్చి బతక్కు!


నేను మారల్ బోరో మగాడిలాంటి మగాడినంటావా?
ఆ మగాడు ఎలా పోయాడో తెలుసా?
నోటి కాన్సర్ తో, బాధపడి, బాధపడి!
మగాడివి, మానవత్వంతో జీవించు,
కాన్సర్ రోగిలా చచ్చి బతక్కు!

పొగ వదిలే బొగ్గింజను చూస్తే రొమాంటిక్ గా ఉండచ్చు
కానీ ఆ వాహన చోదకులకి ఆ పొగ చేసిన హాని తెలుసా!
పొగని ప్రేమించకు
కాన్సర్ రోగిలా చచ్చి బతక్కు!

పొగ వదలడం పోజు కావచ్చు
పొగ మాత్రం హానికరం!
కాన్సర్ రోగిలా చచ్చి బతక్కు!
పొగ వదలకు- ప్రాణాన్ని వదులుకోకు!
**************

No comments: