Friday, July 20, 2018

స్వీయ కవిత- Theme- ధనము-మానవత్వము- ఇవేం రోజులురా బాబూ!


ఇవేం రోజులురా బాబూ!
ఏవా రోజులు?
ధనవంతులు దానకర్ణులనే
పేరుకోసం పాకులాడిన రోజులు
మనకున్న దానిలో నలుగురి కడుపులూ
నింపాలనుకున్న రోజులు?


ఇవేం రోజులురా బాబూ!
ధనం కోసం కపీనం
పేదల కడుపు కొట్టడానిక్కూడా
వెనుకాడరు జనం!
కన్న వాళ్ళను వీధి పాలు
హాయిగా చేసేస్తారీ జనం!
స్వార్థం తప్ప మరేదీ 
ఎక్కదు లోకులకు
ధనముంటే చాలు లోకులకు
మానవత్వం వారికెందులకు?
ఇవేం రోజులురా బాబూ!
****************

No comments: