Wednesday, July 4, 2018

చిత్రకవిత- ఊగిసలాడే ఈ బ్రతుకు




ఊగిసలాడే ఈ బ్రతుకు

ప్రతి రోజూ పొద్దున్నే బండేసుకు నాబోటి వారిళ్ళలో
ప్లాస్టిక్ సామాన్లు అమ్మజూస్తా
ఒక్కో రోజు మంచి బేరాలు తగుల్తాయి,
మరో రోజు పెట్రోలు ఖర్చు, పస్తులు!


నా శక్తి కొద్దీ సంపాదనొస్తుందనుకున్నాను
ప్లాస్టిక్ రద్దు గురించి మాటలు విన్నప్పుడు
నా బ్రతుకు తెరువు దెబ్బతింటుందని తెలుసు
అందాకా ఆశ-నిరాశల మధ్య ఊగిసలాడే ఈ బ్రతుకు సాగిపోవాలి!
************

No comments: