1. “ఊహల ఊయల వూగెనుగా .. “ అంటూ
ఓ కర్ణకఠోర గాత్రం గొంతెత్తి పాడితే
సభలోని జనాల ఊహలు ఆవిరై
వాళ్ళని పారిపొమ్మని ఉసిగొల్పాయి!
2. పెద్ద ఉద్యోగం వచ్చిన వెంటనే ఓహో..
ఊహల ఊయల వూగెనుగా ..
చేరిన తరువాత బాధ్యత తెలిసి
నేలమీద నడవడం నేర్చుకున్నా!
3. నా మూడవ కథకి బహుమతి వస్తే
నేనేదో గొప్ప రచయిత్రినని పొంగిపోయా!
నాలో ఊహల ఊయల వూగెనుగా ..
ఆ తరువాత వరుసగా పరాజయాలే!
4. శిక్షణా తరగతులు పూర్తి చేసుకుని
మా వూరికి రైలెక్కినప్పుడు
అమ్మానాన్నలతో కబుర్లు చెప్తున్నట్టు
ఊహల ఊయల వూగెనుగా ..!
5. వాన పడుతుంటే చెట్టుకింద ఉయ్యాల ఊగాలని
ఊహల ఊయల వూగెనుగా ..
బళ్ళో సైన్సు పాఠం గుర్తొచ్చి
ఆ ఊహకి గుడ్ బై చెప్పేశా!
**********************
No comments:
Post a Comment