సర్వం మాయే
వ్యసనాలకు దూరంగా ఉండే
మనుషులు కూడా
ఈ మయాజాలంలో చిక్కుకుంటున్నారు
ముందు ఒక సౌకర్యంలా ఉద్భవిస్తుంది
తరువాత మరిన్ని సౌకర్యాలందిస్తుంది
అవీ, ఇవీ చూడమని
ఉప్పందిస్తుంది
వాటి చుట్టూ ఒక ఉచ్చు బిగించి
ఊపిరాడకుండా చేస్తుంది
భార్య, పిల్లలు, ఉద్యోగం-
అన్నీ దీనంత ఆకర్షణీయంగా ఉండవుగా మరి!
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే
ఏం లాభం?
ఊబిలో చిక్కిన మనిషికి చావు
తప్పదు
అంతర్జాలం మాయలో చిక్కిన
మనీషికి బాధ తప్పదు
సర్వం మాయేనని
గ్రహించేసరికి ఫలితం శూన్యం!
**********
No comments:
Post a Comment