Tuesday, July 3, 2018

సినిమా పాట- అదే దృశ్యంం- వేరే పాట- ఏమని పాడెదనో ఈ వేళ


 పల్లవి: పాటలు రావు సుమా ఈ పూట
        కోకిలలే మౌనముగా నిదురించిన చోట   ||పాటలు||

చ: ఆనందముగా గడిచిన  రోజులు
    రావు కదా అను బాధలో ఉంటే
    వీణ ఉన్ననూ, రాగముండదు
    మనుషులున్ననూ మమతలుండవు     ||పాటలు||

చ:  మగువకు మనువే దుర్భరమైతే
     మెట్టిల్లే ఒక పంజరమైతే
     చెదిరిన కలలే మిగులును కాదా
      బ్రతుకున మోక్షము రానే రాదా!       ||పాటలు||
*************

No comments: