Sunday, October 15, 2017

చిత్ర కవిత - పచ్చదనం ఉంటే...

పచ్చదనం ఉంటే...
పచ్చదనం ఉంటే మన కళ్ళకి విందు
పచ్చదనం ఉంటే మన ఆటపాటలకి నీడ

పచ్చదనం ఉంటే వేసవిలో చల్లదనం
పచ్చదనం ఉంటే సమృద్ధిగా కురిసే వర్షం
పచ్చదనం ఉంటే జీవనదులకు జీవం
పచ్చదనం ఉంటే కాలుష్యం ఆమడ దూరం
పచ్చదనం ఉంటే సీతాకోక చిలుకల విహారం
పచ్చదనం ఉంటే పచ్చదనానికి పెంపు
పచ్చదనం ఉంటే పక్షుల గూళ్ళు
పచ్చదనం ఉంటే పక్షుల కిలకిలారావాలు
పచ్చదనం ఉంటే పాడి జంతువులకి భోజనం
పచ్చదనం ఉంటే తినడానికి పళ్ళూ, కాయలూ
పచ్చదనం ఉంటే కట్టడాలకి కలప
పచ్చదనం ఉంటే సమృద్ధి
పచ్చదనం ఉంటే ఉండదు లేమి
పచ్చదనం ఉంటే దేశానికి మేలు
పచ్చదనం పెంచడానికి చేద్దాం మన పాలు!

*****

No comments: