Sunday, October 29, 2017

చిత్ర కవిత- ఓ రాతి మనిషీ!

ఓ రాతి మనిషీ!
1.     ఓ రాతి మనిషీ! ఈ పిల్లల ఆక్రోశాలు నిన్ను కదిలించలేదా?
వీళ్ళ ఆకలి బాధను, పైకొచ్చిన పేగులను చూస్తే జాలి కలుగలేదా?
             నీ పిల్లలు ఈ స్థితిలో ఉంటే ఎలా అనిపిస్తుందో ఆలోచించు.


2.     ఓ రాతి మనిషీ! వాళ్ళ కర్మఫలాన్ని అనుభావిస్తున్నరంటావా?
           వాళ్ళ ప్రమేయంతో వాళ్ళీ భూమ్మీదకి రాలేదే!
           తప్పు కన్నవారిదైతే వాళ్ళని శిక్షించవచ్చా? ఆలోచించు.

3.     ఓ రాతి మనిషీ! వీళ్ళని బిచ్చగాళ్ళని చేయడంలో నీ బాధ్యత లేదంటావా?
నువ్వే ఈ పిల్లలని కన్నా వాళ్ళకి తల్లివో, తండ్రివో అయితే నీ పెంపకంలో లోపం లేదూ?
గురివింద గింజలా గొప్పకొట్టక కనికరంతో అలోచించు.

4.     ఓ రాతి మనిషీ! ఏమిటీ, నాకెటువంటి సంబంధమూ లేదంటావా?
పిల్లలని అడుక్కోనీయకుండా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశావా?
స్వార్థం వీడి సామాజిక బాధ్యతతో ఆలోచించు.

5.     ఓ రాతి మనిషీ! ఏమిటీ సంబంధిత అధికారులు లెక్క చేయలేదా?
వారికి ఉద్వాసన పలకడానికి నువ్వేం చేశావు?
పోనీ, వారు బాధ్యత తెలుసుకునేలా ఏమైనా చేశావా? ఆలోచించు.

*****

No comments: