Tuesday, October 31, 2017

చిత్ర కవిత- ఏమిటీ వివక్ష?

ఏమిటీ వివక్ష?
బ్రతికినప్పుడు డబ్బులతో బ్రతకలేదు
పోయినప్పుడైనా గౌరవం చూపలేదు
ఏమిటీ వివక్ష?


సుదూర ప్రాంతమంటే డాక్టర్లు పరార్
సుదూర ప్రాంతమంటే అంబులెన్సు ఉండదు
ఎందుకీ వివక్ష?

గిరి ప్రాంతాల వారి నిధులు స్వాహా!
గిరి ప్రాంతాల వారి వసతులు గోవిందా!
ఏమిటీ వివక్ష?

పట్నాలలో పెంపుడు జంతువుకుండే ప్రాధాన్యత
దూర ప్రాంతాల్లో మనుషులకుండదు
మనుషులందరిలోనూ ప్రవహించేది ఒకే రక్తం కాదా!
ఏమిటీ వివక్ష?

****

No comments: