Thursday, August 10, 2017

చిట్టి కథ -keywords"ఛీ పొండి...మీరు మరీనూ ".. హాస్య సరస మేళవింపుతో -- పెద్ద ఉద్యోగం

పెద్ద ఉద్యోగం

అపర భద్రకాళిలాగ మీనాక్షి భీకర రూపం దాల్చింది. కనపడ్డ వస్తువే ఆయుధంగా మలచుకొని భర్త నిరూప్ ని చితకబాదింది. “మీనా, మీనా”, అని ఆమెను అనునయించబోయినా పనిచేయలేదు. “భార్యకు తెలియకుండా వెధవ్వేషాలేస్తావుట్రా!” అని హుంకరించింది. “లేదు అమ్మతల్లే, ఈ మాటు మా ఆవిడకి చెప్పి మరీ చేస్తాను”, అన్నాడు అతి తెలివిగా. అంతే, మరో రౌండ్ కోటింగ్ ఇచ్చింది మీనాక్షి. “భార్యని గౌరవించడం చేతకాని నీకు భార్య కావలసి వచ్చిందా? మీ అమ్మానాన్నలని అనాలి, నీ లాంటి అచ్చోసిన ఆంబోతులని అపర శ్రీరామచంద్రులని చెప్పి, పెళ్ళికూతుళ్ళ ముందుకి వదిలినందుకు”, అని తిడుతూనే ఉంది. “శాంతించు తల్లే....”, అని కాళ్ళ మీద పడ్డాడు. “మరెప్పుడైనా అబద్ధాలు చెప్తావా?” అని భీకర స్వరంతో అడిగింది మీనాక్షి. “ఆపద్ధర్మాలో?” అని సందేహం వెలిబుచ్చాడు. మరో రౌండ్ తగిలిస్తూ, “ఊహూఁ”, అని గద్దించింది. “సర్లే తల్లే, ఇంకెప్పుడూ ఎవరితోనూ అబద్ధాలు చెప్పాను. మా ఆవిణ్ణి వదిలిపెట్టు తల్లే..” అని బతిమాలాడు.

Wednesday, August 9, 2017

ఆనందపుటలలు

1.     అలలు-తీరం ఒకే కుటుంబానికి చెందినవి
అలలది పిల్లల మనస్తత్వం- విసురుగా ఉంటాయి
తీరానిది కన్న ప్రేమ- ఆ ఆకతయితనాన్ని భరిస్తుంది.

ఇంకెక్కడి రిక్షా?


1.     చిన్నప్పుడు ఆటోలు దొరికేవి కావు
పైగా దొరికితేనేమో ఖర్చెక్కువ

Tuesday, July 25, 2017

ఐకమత్యమే బలం

ఐకమత్యమే బలం
1.       ఐకమత్యం అంటే....
చలి చీమలు పాముని చంపడం.

Monday, July 10, 2017

నేను సబలను

నేను సబలను
1.     ఈ మధ్య నన్ను భూమిలోకి రాకుండా చంపేస్తున్నారు
ఏం, మా అమ్మ ఉందిగా, నేనెందుకు బ్రతకకూడదు?

Saturday, July 8, 2017

ఆధిపత్యమంటే.....


1.     పెద్ద చేప చిన్న చేపను మింగడంకాదు
చిన్న చేపను పెద్ద చేప పొట్టను పెట్టుకోకుండా కాపాడడం.

Tuesday, July 4, 2017

పరమార్థం



1.     చిన్నప్పుడు నురుగుతో బుడగలు చేసి ఆ బుడగల్లో రంగులు చూసి పొంగిపోయాను
కానీ ఆ బుడగలు క్షణ భంగురాలని తెలుసుకోలేకపోయాను.

ఉద్వేగం


1.     నాకు సంతోషమొస్తే పట్టలేను
బాధ వస్తే కృశించిపోతాను
నా మనసు ఉద్వేగ భరితమైనది.

Saturday, July 1, 2017

నేనెంత కష్టపడినా….

నేనెంత కష్టపడినా….
1.     ఎవరైనా అందనివాటికి అర్రులు చాస్తారు కదా!
అలాగే నేను పండితురాలిననిపించుకుందామనుకున్నాను.
ఒక ముసుగు వేసుకుని సాహితీ జగత్తులో మెలిగాను.

యోగా అంటే...

యోగా అంటే...
1.    ఫిట్నెస్ మంత్రం కాదు
2.   ఆషామోషీ అంతకంటే కాదు

Monday, June 5, 2017

The Mysore Visit, Day 1: Within Mysore


 
Mahishasura, the demon whom Chamundi killed; the city is nameed after him (Mahishapura)
On the day we were supposed to start for Mysore, Murphy’s Law was in full force and our programme was in deep doubt.  However, things fell in place in the last minute and we started. This time, we stayed at friends’ place instead of a Guest House.  A big word of THANKS to my friend and family for taking us in, and also for giving up their air-conditioned room to us! My friend’s assistant had made out a schedule of the places to visit in and around Mysore over a period of two days.  

Wednesday, May 31, 2017

అన్నదాత ఆత్మఘోష

అన్నదాత ఆత్మఘోష
1.     ఫ్యాక్టరీలొచ్చాయి మా నదులని కలుషితం చేశాయి
ఫ్యాక్టరీలొచ్చాయి మా భూగర్భజలాలను దోచాయి

Thursday, May 25, 2017

బుద్ధుడి వెన్నెల


1.     వెన్నెల కాంతులలోమెరిసిపోతున్న
బుద్ధుణ్ణి చూస్తే ఏవో ఆలోచనలు

Wednesday, May 24, 2017

మాతృప్రేమ

1.     చిన్న పిట్టను కదా అని నాకు పిల్లలపై ప్రేమలేదని అనుకోవద్దు
చెట్టుకోమ్మపై చిన్న గూటిలో ఉంటాంగనుక గాలివానకి కొట్టుకుపోతామనుకోకండి.

Tuesday, May 2, 2017

Tuesday, April 25, 2017

వాలుజడ


వాలుజడ

1.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
బుసబుసలాడే నల్లత్రాచు పెంచుకున్న ప్రబంధ కన్య

Sunday, April 23, 2017

చిట్టి కథ keywords" అతను/ ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు ..."- వుడా పార్కు వృద్ధ గురువు



గృహిణినైన నేను రోజూ సాయంత్రం నాలుగున్నర- ఐదున్నర గంటల మధ్య కొత్త వుడా పార్కు లోని వాకర్స్ పారడైస్ లో నడవడం అలవాటు. ఒకపక్క పనిమనిషి పనైపోతుంది, మరోపక్క మా వారూ, పిల్లలూ రావడానికి ఆరు దాటుతుంది. ఒక రోజు కాస్త నిస్త్రాణగా అనిపించి, ఒక బెంచి మీద కూర్చున్నాను. సాయంకాలపు పిల్లగాలులు సముద్రం నుండి వీస్తాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ పని ఇదివరకెన్నడూ ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తున్నంతలో ఒక వృద్ధుల సమూహం వచ్చి మిగతా బెంచీల మీద స్థిర పడ్డారు.

Wednesday, April 19, 2017

భవిష్యత్తులో రైతన్న



1.     భవిష్యత్తులో రైతన్న హలం పట్టడు
బలరాముడికి బదులు బండి (ట్రాక్టర్)కి మొక్కుతాడు.

Wednesday, April 12, 2017

గిజిగాడిని చూసి నేర్చుకో



1.     దేవుడు అమర్చిన ఈ పచ్చని ప్రపంచంలో అత్తగారిలా వేలు పెట్టే ఓ మానవుడా!
చెత్త పెంచడం నీకు తెలుసు, నీ చెత్తని మంచికి వాడడం గిజిగాడికి తెలుసు.