1.
ప్రకృతి కాంత ఆకుపచ్చని చీరతో, అందాల
సుగంధాల పూవులతో
మన మననకు తన
ప్రేమని మనపై వర్షిస్తుంది.
2.
అందాన్ని ఆరాధించడం చేతకాని మనం
పచ్చని
రంగుని మట్టి రంగుగా మార్చేస్తున్నాం.
3.
మనం అందాన్ని అణగదొక్కామని గర్వించే
మూర్ఖులం
నేల విలువ
పెంచామనుకుంటున్న పోగరుబోతులం.
4.
మనం ప్రకృతి కాంతకు పెట్టిన హింసలు
శాపాలుగా
మనకు తిరిగొస్తాయి.
5.
క్షామం, కరువు, అతివృష్టి, ఉప్పెన
వడదెబ్బ,
వాతావరణ కాలుష్యం-ఒకటేమిటి ఇలాంటివెన్నో మనల్ని ఆవహిస్తాయి.
6.
ప్రకృతి పిల్లలైన చెట్లు, చేమలు, ఏళ్ళు,
నదులు అన్నింటిని మనం నిర్మూలం/ మలినం చేస్తే
మనపిల్లలకి
కొత్త రోగాలు ప్రసాదిస్తుంది ఆ తల్లి, తన కడుపుకోతకు ప్రతీకారంగా.
7.
ఓ మనిషీ, కళ్ళు తెరుచుకో!
ప్రకృతిని
గౌరవించు
ప్రకృతిని
కాపాడు
నిన్నూ,
నీ వరసుల్నీ కాపాడుకో!
*****
No comments:
Post a Comment