Monday, March 20, 2017

చిట్టి కథ – keywords- "అహాన్ని వీడిన రెండు పశ్చాత్తాప హృదయాలు పరస్పరం క్షమాకుసుమాలతో అభిషేకించుకున్నాయి"---అనుమానం- అహంకారం


అనూహ్యా, వెనుక వీధి అనూప్ గారబ్బాయి అభిజిత్ కి హీమోఫీలియా వల్ల అంతః రక్త స్రావం జరిగితే అతని రక్తానికి సరిపడే రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల చుట్టూ వారం రోజులుగా తెగ తిరుగుతున్నవుట?’ అందామె తల్లి.

“వెటకారమా?’’ అని తిక్కగా జవాబిచ్చింది అనుపమ.  “నువ్వు చేసే మంచిపనులను ఎప్పుడైనా కాదన్నానా? నాతో మాటవరుసకి కూడా అనలేదు?” అంది తల్లి.
“చేసిన మంచికి బాకా ఊదుకోకూడదని నువ్వేగా చెప్పావు? పైపెచ్చు, ‘నా పెంపకం మీద నమ్మకం ఉంది, నా కూతురెప్పుడూ తప్పు చేయదు’, అని నువ్వే అంటూంటావు కదమ్మా!” అంది అనుపమ.
తల్లి చల్లబడి, “అవునే, నువ్వు ఎప్పుడూ డబ్బు అడిగితే ఎందుకో నువ్వే చెప్తావుగా. ఈ మాటు చెప్పకపోతే అనుమానం వచ్చింది”, అంది. కూతురు సిగ్గుపడుతూ, “సారీ అమ్మా! నువ్వు నన్ను ప్రశ్నలడిగేసరికి అహం పొడుచుకొచ్చి అప్పుడప్పుడు పనైనా నీ మీద ఉద్ధరింపు కొద్దీ లేట్ గా ఇంటికోచ్చేదాన్ని. డోంట్ వర్రీ, లైబ్రరీలో చదువుకునేదాన్నిలే! ఎంతైనా, నీ పెంపకం సరైనదే!” అంది. అప్పుడు, అహాన్ని వీడిన రెండు పశ్చాత్తాప హృదయాలు పరస్పరం క్షమాకుసుమాలతో అభిషేకించుకున్నాయి.

****

No comments: