Sagara Teeram wishes readers a very happy Ugadi in advance! May u n urs be blessed in Hevilambi!
వచ్చే ఉగాది పండుగ
1.
ఆ. వె. కోకిలమ్మ
కూసె కొత్త వత్సరమొచ్చె
మావి కొమ్మ పూసె మావిగాసె
పూల పరిమళాల పుడమి పులకరించె
జనుల చింత తీరె జగము నందు||
2. ఆ. వె. తలకు నీరు పోసి
తలయారబెట్టిన
జుట్టు దువ్వి రంట జోరుగాను
ప్రీతితోన చిత్ర వేషముల ధరించి
యాడుచుండ ముదము యచట పొంగె||
3. తే. గీ. మందిరాన పసుపు
కుంకుమలది బొట్టు
దిద్ది పూలతో పూజించి దేవి కొరకు
పరమయన్నముల్ నర్పించు భాగ్య మున్న
మనసు నిర్మలత్వము నొంది మలినమొదిలె||
4. ఆ. వె. ఆరు రుచులు గలిగి
ఆనందమిచ్చెడి
పచ్చడుంటె యింట పరమ ముదము
రుచికరమగువంట రారమ్మని పిలువ
జిహ్వ సంతసించె జీర్ణమవగ||
5. తే. గీ. ఎల్లరకు శుభములకోరి
ఎల్లలేని
సుఖములను పొంది ప్రేమయు శుభము కలుగు
గాకయని పెద్దలేయునక్షతలు చాలు
యీ దినము సార్థకతనొందు యెప్పటికిని||
***
No comments:
Post a Comment