1.
మర్కట రాజ్యమంటే రామభక్తుని సామ్రాజ్యమని
భ్రమపడకోయ్
అది మన
పూర్వజుల వెకిలి చేష్టలకి ఉదాహరణ.
2.
నాడు మానవుడు కోతులనాడిస్తే
ఇప్పుడవి
అతణ్ణి వీధిన పడేశాయి.
3.
ఏదీ సంక్షేమ రాజ్యం?
ఏదీ ప్రజల
రాజ్యం?
4.
మనవ కంటకుల బదులు మర్కట కంటకులుంటే
దేశానికీ,
ప్రజానీకానికి జరిగే మేలేం లేదు.
5.
ఆనిమల్ ఫార్మ్ కథను గుర్తు తెచ్చుకోవోయ్ మర్కటరాజా!
ప్రజాసేవ
మరిచావోయ్, త్వరలో తింటావు కాజా!
6.
మానవులైనా మర్కటాలైనా సేవా దృక్పథం
లోపిస్తే
అవుతారు
రాక్షసులు, కంటకులు,
అనుభవిస్తారు
వాళ్ళ ప్రవర్తనా పర్యవసానాలు!
***
No comments:
Post a Comment