Sunday, March 19, 2017

దైవస్తుతి & గురుస్తుతి

దైవస్తుతి
1.     తే. గీ.  జల్లెడ పట్టి నేను జీవితం కథగా మలచినాను
                   ఎటుల తెలియు నాకు కవిత్వ మేమనడగ
                   కవిత రాయుమన్ జెప్పిన కరుణ కలిగె
                   లంబ జఠరు నాశీస్సు లభించె భాగ్యాన||


2.     ఆ. వె. కవిత నేర్వ నేను కష్టంబు పాడుదునా
                   యంచు నేను జేయు యాపన విడు
                 మంచు బుద్ధిదాత్రి మా తల్లి దీవించె
          కవిత వ్రాయ పూనుకొంటి నేను||

గురుస్తుతి
3.     ఆ. వె. దైవమొచ్చె దరికి ధైర్యము చెప్పగా
      
         మనిషి రూపమెత్తె మనసు స్థైర్య
        
        మొంద వ్రాయుమంచు మంచిగ తలపోయు

         గురువు పాదమునకు గౌరవంబు||

4.     ఆ. వె. వృత్తి యందు మేటి ప్రవృత్తిలో ఘనా

        పాటి రామశర్మ పేరు గలదు

        యాతనికి పలుకుల యాతడు పద్యముల్

       సేయు యతడి సాటి వేరు గలరె?
5.     తే. గీ. కథలు యతడి శ్వాస కవనం కనుపాప

        దీనులను ప్రోత్సహించుటే దైవ కార్య

        మతనికి ముఖపుస్తక నేస్తమతడు నాకు

         ధైర్యమిచ్చెడి రాజేశు దానశీలి||


*****
(this is my first effort at metered poetry)

No comments: