1.
దేశరక్షణ కేవలం సైన్యపు బాధ్యత అనుకోకు
మన దేశ
పౌరుడిగా అది నీ బాధ్యత కూడా!
2.
సైనికులు ప్రాణాన్ని పణంగా పెట్టి
దేశాన్ని కాపాడుతారు
పౌరులు
విలువలను కాపాడి దేశభక్తిని పెంపొందిస్తారు.
3.
ప్రతీ సైనికుడూ యూనిఫారంలో ఉన్న పౌరుడే!
ప్రతీ
పౌరుడూ యూనిఫారంలో లేని సైనికుడే!
4.
సైనికుడు సరిహద్దునెలా కాపాడతాడో
ప్రతి
పౌరుడు దేశంలో మంచిని, విలువలని కాపాడాలి.
5.
నూటపాతిక కొట్లలో ‘నేనొక్కడినే ఏం
చేయగలను?’ అని అలోచించి జాగు చేయకు
సేతు బంధన
సమయంలో ఉడుత పాత్ర గుర్తు చేసుకో!
6.
ఎవరికీ వారే ‘నేను ప్రగతిని తేలేను’ అని
చేతులెత్తేస్తే
మన దేశమెక్కడికి
పోతుందో ఆలోచించు!
7.
దేశంలో ఇది- అది బాగులేదనడం సుళువు
ఆ
బాగులేని దాన్ని మార్చడం కష్టం.
8.
‘దేశ స్వేచ్ఛ మనమే కాపాడగలం’, అని అందరూ సంకల్పిస్తే
నూట పాతిక
కోట్ల మందిని ఆపే ధైర్యం, బలం ఎవరికున్నాయి?
9.
అందుకే, భారతీయులమంతా నడుం కట్టి దేశస్వేచ్ఛ
రక్షణకై పాటు పడదాం!
దేశ రక్షణలో
ఉడుత సాయం చేద్దాం!
***
No comments:
Post a Comment