Wednesday, March 22, 2017

ఆమనికి స్వాగతం


కొత్త చిగుళ్ళు తొడిగిన మోళ్ళు
పక్షుల కిలకిలారావాలతో నిండిన గూళ్ళు
రంగురంగుల పూలు
రాలితే నేలపై తివాచీలు

పచ్చని దుప్పటిని కప్పుకున్న నేల
నీలి రంగు అలముకున్న అమేఘాకాశం
ఈ ప్రకృతి అందం మనింటి బయట ఆగిపోకూడదు
ఆమని అందాన్ని మనింట స్వాగతిద్దాం
మనలోని నిరాశావాదాన్ని పారద్రోలుదాం
మల్లెపూల పరిమళాన్ని ఆస్వాదిద్దాం
మన మనస్సులలో స్వచ్ఛమైన మల్లెలను పూయిద్దాం!

***

No comments: