Tuesday, March 13, 2018

చిత్రకవిత- వీళ్ళు తట్టుకోగలరా?


వీళ్ళు తట్టుకోగలరా?
అర్థరాత్రి నుండి మా రోజు ప్రారంభమవుతుంది
మనుషుల్లో శుచీ-శుభ్రం ఉన్నా, లేకపోయినా
వారు చేసిన చెత్తని ఊడ్చి రోడ్లన్నీ శుభ్ర పరుస్తాం

అయినా వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు
ఒక పలకరింపు లేదు, ఒక చిరునవ్వు  లేదు
కొన్నాళ్ళు పనికెళ్ళకపోతే కోపాలూ, తిట్లూ గాని
‘ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నావా?’ అనడిగే నాథుడు లేడు
ఇంటిని అద్దంలా ఉంచుకునే వీళ్ళు రోడ్లనెందుకు పాడుచేస్తారు?
ఉమ్మడి సొమ్మంటే అంత లోకువా?
మేమే గనుక సమ్మె చేస్తే, వీళ్ళు తట్టుకోగలరా?
***********

No comments: