నిచ్చెనని పక్కకి పెట్టినట్టు
రెక్కలు రెపరెపలాడిస్తూ ఎగిరే పక్షుల సందడి
ఈ నాడు మనకు వినిపించదే ఆ సడి?
ఎత్తైన కట్టడాలు వస్తున్నాయి గాని
పక్షులు గూళ్ళు పెట్టడానికి లేదే అక్కడ చోటు!
గుబురైన చెట్ల మధ్య గూళ్ళు అమర్చుకోవాలంటే
ఏవీ గుబురైన చెట్లు?
మానవులు సాటి వారిని దోపిడీ చేసి,
వారికి నిలువ నీడ లేకుండా చేయగలరు
ఒకప్పుడు ఇంట్లో, పెరట్లో గూడుంటే అదృష్టం
ఇప్పుడాలోచనలు మారాయి గనుక
పక్షులకు పట్టింది దురదృష్టం
ఇదంతా మానవత్వం లేని మానవుల పని
మనం ఎదుగుతూ ఇతరులను ఎదగనిస్తే మనీషి
మనకోసం ఇతరులని నిర్మూలిస్తే దురాగతం
పైకెక్కి, నిచ్చెనని పక్కకి పెట్టినట్టు,
పక్షులెదగనిచ్చిన మనుషులే
పక్షులకు నిలువ నీడ లేకుండా
చేస్తున్నారు!
*************
No comments:
Post a Comment