1. “హితుడు
ఒక్కడున్న చాలు” నన్న
చద్ది
మూట వంటి పెద్దల మాటను
లెక్కచేయక
పెంచుకుంటి నేస్తములన్ అంతర్జాలములో
లెక్కకు
తప్ప అక్కరకు రాని వారని తెలిసి క్షోభపడితిన్.
2. కష్టములు లేక
మనుషులు లేరు
కానీ,
అక్కరకు రాని చుట్టముల్ మెండు
వీరిని నమ్ముకొనక
దేవుని నమ్మిన
ఆ హితుడు
ఒక్కడున్న చాలు, కష్టముల్ తీరగా!
3. స్త్రీ వాదము
మెండుగున్న ఈ సమాజంలో
“హితుడు
ఒక్కడున్న చాలు” యనిన
వారు
కోపగింతురు గనుక ఉభయ లింగములకు
పనికి
వచ్చు పదమును కనిపెట్టవలెనిపుడు.
4. కష్టమొసగినా మన
మంచిని కోరువాడు
మంచియొసగి
కూడ మనలను నేలపై ఉంచువాడు
వేరెవరో కాదతడు
మనలకు కనిపించక మనల గాచే దేవుడు
అట్టి
హితుడు ఒక్కడున్న చాలు గదా!
5. చెడ్డ పనులలో
సహకరించువారు
ఒకరినొకరు ‘ఇట్టి
హితుడు
ఒక్కడున్న చాలు’
ననుకొందురు
గాని పట్టుపడినప్పుడె తెలియున్
ఇది
నిక్కమగు స్నేహము గాదని!
***************
No comments:
Post a Comment