Saturday, March 24, 2018

గద్య పూరణము- Theme- Sri Ramanavami- ఏ రీతి కీర్తింతునో రామ


ఏ రీతి కీర్తింతునో రామ

ఏ రీతి కీర్తింతునో రామ
నిన్నే రీతి వర్ణింతునో రామ


మీ వంశాన్ని పొగడగ కాళిదాసుని కాను
నీ శౌర్యాన్ని కీర్తింప వాల్మీకిని కాను
నీ దర్శనము పొందగ నీ దాసుని గాను
నీ నామ పారాయణమనునిత్యము జేయ నే త్యాగరాజును కాను || ఏ రీతి||

నీ సాహచర్యము పొంద నే సీతను కాను
నీ వెంట అడవులకేగ నేను లక్ష్మణుడ కాను
నీపై అవ్యాజ భక్తి జూప పవనసుతుడ కాను
నిను జూచి, వెరచి వెనుకకు పోవ నే సముద్రుడ గాను || ఏ రీతి||

నీ పాద స్పర్శకు నోచ నే నహల్యను గాను
నీచే విరువబడుటకు హరువిల్లును కాను
నీచే దీవింపబడుటకు జటాయువును గాను
నీ వేళ్ళ ముద్రలు మోయుటకు నే నుడుతను గాను || ఏ రీతి||

పితృవాక్య పరిపాలనలో నీకు సాటిరాలేను
దానవ మథనము సేయుట కశక్తురాలను
శత్రువును క్షమించుటకు కష్టపడుదును
నీ భక్తులకు నేమాత్రము పోలనను నేను || ఏ రీతి||
*******

No comments: