Friday, March 9, 2018

గద్య పూరణము- keywords- "లోకమందు యెన్నో వింత పోకడలు..చూడర కన్నా ..!"



1.     లోకమందు యెన్నో వింత పోకడలు..చూడర కన్నా ..!
మనుషుల జంపు మనుషులుండు ఈ లోకమున
కుక్కల జంపు కుక్కలుండు ఈ జగమున
గోమాత ఒక పులిపిల్లను బెంచెనట!


2.     ఇక్కడి పుల్ల అక్కడ పెట్టని ప్రబుద్దులుండి,
గారమే గొప్పగా జూపు ఈ జగంబున
కాలుసేతులు లేని వారు ముగ్ధమోహన చిత్రముల గీసిరట
లోకమందు యెన్నో వింత పోకడలు..చూడర కన్నా ..!

3.     ఒక ఉపగ్రహమును అంగారకగ్రహమునకంపిరి మానవుల్
లోకమందు యెన్నో వింత పోకడలు..చూడర కన్నా ..!
ఉన్నతమైన ఊహ కాంచిన, లేచిన వెంటనే
 దానిని నిజము సేయుదారి కనిపించున్ నేర్వర చిన్నా!

4.     పచ్చ బొట్టుపొడవగ పల్లెటూరి బైతన్నరానాడు
పచ్చబొట్టిపుడు ఫాషనాయె
లోకమందు యెన్నో వింత పోకడలు..చూడర కన్నా ..!
దేనినీ చులకన సేయకుమీ!

5.     డబ్బు లేని నాడు డబ్బొక్కటె కష్టము
డబ్బున్న బోలెడు కష్టముల్ వచ్చు
అయినను మనుషులెగబడుదురు డబ్బులన్న
లోకమందు యెన్నో వింత పోకడలు..చూడర కన్నా ..!
*************


No comments: