I grew up on the East Coast of India, so I'm particularly fond of the Sun and the Sea and hence the title which means sea shore in Telugu. If everyone saw the best of photographs, and read only the best writings, where's the opportunity for the alsorans to showcase their talents( or the absence of them)?
Wednesday, January 31, 2018
Thursday, January 25, 2018
Saturday, January 20, 2018
గద్య పూరణము- keywords- ' కల' , 'అల' , 'తల', 'వల'
1.
‘కల’లు కంటూ కాలక్షేపం చేసే నేను
ఊహల ‘అల’లపై తేలిపోతుంటాను
నిజం వెక్కిరిస్తే పేలిన నా
‘తల’
పట్టుపట్టి ఆ’వల’కు నన్ను నెట్టింది.
Thursday, January 18, 2018
చిట్టి కథకి ముగింపు- పుస్తకాలు నిలిపిన పసుపుకుంకాలు
Given Story:
ఇంట్లోకి అడుగుపెట్టిన త్రిమూర్తికి అంతా
బోసిపోయినట్టనిపించింది. దరహాసంతో వచ్చిన కొడుకు
"డాడీ నీకో సర్ ప్రైజ్... ఇంట్లో సంవత్సరాలుగా
మూలుగుతున్న వాటిని తీసి పాతసరకు కొనేవాడికి ఇచ్చేసాను.మంచి రేటు వచ్చింది.ఆ
డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొన్నాను.నెలకు రెండొందల నెట్ ఆఫర్తో ప్రపంచాన్ని చూడవచ్చు",
అన్నాడు. త్రిమూర్తి కళ్ళు తిరిగినట్టయింది. ఐదువేల పుస్తకాల విలువైన ఇంటి
గ్రంథాలయం కనిపించకపోవడంతో స్పృహ తప్పి పడిపోయాడు ...
My Conclusion:
పుస్తకాలు నిలిపిన పసుపుకుంకాలు
ఆసుపత్రిలో త్రిమూర్తి ‘నా
పుస్తకాలు... నా పుస్తకాలు’, అని మధ్య మధ్య అరవసాగాడు. చుట్టాలింట్లో పెళ్ళినుంచి
తిరిగొచ్చిన భార్య, మణి, చెంగంచుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటోంది. ఈలోగా డాక్టర్
వచ్చి, “ఆయన మనసుకి గాయం తగిలింది. వెంటనే, ఆయన పోగొట్టుకున్న పుస్తకాలు కొనండి.
కొనలేకపోతే, కనీసం లైబ్రరీ నుంచైనా తెప్పించండి”, అన్నారు.
Tuesday, January 16, 2018
Thursday, January 11, 2018
చిట్టి కథ - Sentence- "చేతిని విదిలించి కోపంగా కదిలిపోతుంటే, దూరమవుతున్న ఆత్మీయతను చూసి గుండె భారమైంది"
తండ్రి మనసులోని ఆవేదన
“సిచ్యుయేషన్ ఇది: హీరోయిన్,
అంటే మీ కూతురు, చిన్న ఉద్యోగం చేసే వాణ్ణి ప్రేమిస్తుంది. వాడు మీ ఆస్తులకి ఆశపడి
మీ అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడని మీరు అనుకుంటారు. మీరు పెళ్ళికి ఒప్పుకోలేదు
కాబట్టి ఆ అబ్బాయి మీ ఇంటికొచ్చి మీ అమ్మాయిని ఎవరు కావాలో తేల్చుకో మంటాడు. ఆమె
వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు తీయబోయే షాట్ లో ఈ వాక్యానికి అభినయం చేయాలి: ‘చేతిని విదిలించి కోపంగా కదిలిపోతుంటే, దూరమవుతున్న ఆత్మీయతను చూసి
గుండె భారమైంది’. ఇది తండ్రి మనసులోని ఆవేదనని అవిష్కరించేలా ఆక్ట్ చేయాలి”, అని
వివరించాడు అసిస్టెంట్ డైరెక్టర్. చిన్న చిన్న వేషాలు వేసే వీరబాబు దీనికి ముందు షాట్
గుర్తు చేసుకున్నాడు: వీరబాబు హీరోయిన్ చెయ్యి పట్టుకుని, “ఇన్నేళ్ళ ప్రేమని
కాదనుకుని నిన్నగాక మొన్న నీ జీవితంలోకొచ్చి, నిన్ను మాయ మాటలతో భ్రమపెట్టే వీడు
ఎక్కువైపోయాడా?” అని ఆర్ద్రతతో అన్నాడు, కోపంతో కాదు.
Saturday, January 6, 2018
గద్య పూరణము- keywords-రోజులన్ని పొంగిపొర్లె సంతసాల పొందికలో
1.
అమ్మమ్మ మురిపాలతో, తాతయ్య నీతి కథలతో
రోజులన్ని పొంగిపొర్లె
సంతసాల పొందికలో
సొంత ఊరుకి తిరిగి వచ్చు
రోజు రాగ
కన్నీరు మున్నీరుగా కార్చె
నా కనులు.
Thursday, January 4, 2018
చిట్టికథ- 2 Sentences- నిజమైన దేశభక్తుడు
చిట్టికథకై వాక్యాలు :
“వెళ్ళాల్సిందేనంటారా?"
అడిగిందామె సజల నయనాలతో. "ఒప్పుకున్నాక
తప్పదు కదా!"
అన్నాడతను తన చేతిలో చేయిని మరోసారి గట్టిగా నొక్కుతూ విడివడే పొడి
దరహాసంతో...
నిజమైన దేశభక్తుడు
కర్తార్ సింగ్ కి తన ఊరు వెళ్ళేటప్పుడు
ఆనందమే ఆనందం. తల్లి దండ్రులతో నెల రోజులు గడుపబోతున్నందుకు; అంతే కాదు ఈ మాటు అతనికి
సిమ్రన్ అనే అందాలరాశితో పెళ్ళి కాబోతోంది కూడా! పైకి గుంభనంగా కనిపించే అతను ఆమె
ఫోటో ని తన మొబైల్లోనూ, తన మనసులోనూ భద్రంగా దాచుకున్నాడు.
గద్య పూరణము- keywords-చూడగానే మనసు గెంతులేస్తోంది..!!
1. చరిత్రలో ఎనభై ఒకటి
ఆంగ్లంలో కూడా అంతే
ఇన్ని మార్కులిచ్చిన మార్క్
షీట్
చూడగానే మనసు
గెంతులేస్తోంది..!!
గద్య పూరణము- keywords- అమ్మ కన్న మిన్న అవనియందెవరన్న
1.
అమ్మ కన్న మిన్న అవనియందెవరన్న
అన్నంతనే ఈ
కొత్త తరం వారికి కోపం వచ్చున్
అమ్మ కన్న మిన్న
మా మొబైలేనంచు
వాదించుచుందురు
వీరికి బుద్ధెట్లు వచ్చునో!
Wednesday, January 3, 2018
చిట్టి కథ- keywords- " నా ప్రయత్నం నచ్చకపోతే ప్రోత్సహించకండి...అంతే కానీ వ్యంగ్య విమర్శలతో బాధపెట్టకండి " - మోడరన్ వేటూరి
మోడరన్ వేటూరి
పద్మాసన ఈ మధ్యనే రాతకోతలు
మొదలెట్టింది. ఆత్మవిశ్వాసం ఇంకా కుదరక స్నేహితుడు శివని అభిప్రాయమడిగింది. ఆమె
వ్రాసిన మొదటి నాలుగు కవితలు చదవడానికి వారం రోజులకి పైగా తీసుకుని, “భేష్ పద్మా,
మోడరన్ వేటూరివౌతావు”, అని కాగితాలు తిరిగిచ్చేశాడు. వేటూరి అంటే భక్త కన్నప్ప, శంకరాభరణం,
సిరిసిరిమువ్వ, లాంటి సినిమాల్లో పాటలు వ్రాసి, అవార్డులు గైకొన్న మహానుభావుడని ఆమెకు
తెలుసు. అందుకే, వేటూరి పేరు వినగానే ఎగిరి గంతేసినంత పని చేసి, ఆ రోజు నుండీ
అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకీ కవితలు వినిపించడం మొదలుపెట్టింది.
గద్య పూరణము- keywords- చెరలోన బంధించె మధుర చరవాణి ..!
1.
పుస్తకం హస్తభూషణమొకప్పుడు
ఇప్పుడు ఆ స్థానం చరవాణిది
పుస్తకం జ్ఞానాన్ని పెంచె,
కాని అజ్ఞానం పంచి
చెరలోన బంధించె
మధుర చరవాణి.
Tuesday, January 2, 2018
చిట్టి కథ- keywords- "ఆ ఖర్చంతా నేనే భరిస్తాను... ముందు పని కానివ్వండి " అందామె చేతి బంగారు గాజులు తీసి అందిస్తూ-టూకీగా
“రాజా- రాణి సంపన్నులైన ఆదర్శ దంపతులు.
వాళ్ళకుండే ఒకే ఒక కొరత పిల్లలు లేకపోవడం. రాజా ఎవరైనా దత్తత తీసుకుందామంటాడు;
రాణి ఒప్పుకోదు, ‘మీకుండే విలువల విలువ వాళ్ళకి తెలియకపోవచ్చ’ని. లక్ష్మి అనే
అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తుంది. రెండవ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోయినా, తను ఎంతగానో
ప్రేమించే భార్య కోరిన కోరిక కోసం ఒప్పుకుంటాడు రాజా. లక్ష్మికి సవతంటే ఇష్టంలేక రాణిని ఇంట్లోంచి వెళ్ళగొట్టిస్తుంది.
కట్ చేస్తే ముసలి వయసులో ఉన్న రాణి ఒక అనాథని చేరదీసి అతని పంచన ఉంటుంది. ఒక రోజు ఆమె
తాయిలాలమ్మి వస్తుంటే ఒక ఆక్సిడెంట్ ని చూస్తుంది. ఒక బెంజ్ కార్ కింద చిరుగు
పాతల్లో ఉన్న ఒక ముసలామె పడిందని తెలుసుకుంటుంది.
Subscribe to:
Posts (Atom)