Tuesday, January 16, 2018

చిత్రకవిత- గాలిపటం..... గాలిపటం



గాలిపటం..... గాలిపటం
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
గాలిపటాలు ఎరుగని వాళ్ళుండరు
గాలిపటానికి ఏకంగా పండుగే ఉంది మన దేశంలో



గాలిపటం అనగానే ఎన్నో గుర్తులు
వార్తాపత్రికని చీల్చి చెండాడిన వైనం,
లయపిండి జిగురుతో తోక చేసిన రీతి
బొడ్డు ముడి వేయలేక పక్కింటి చిన్నన్నయ్యని సాయం కోరడం....
సముద్రపొడ్డున గాలిపటం ఎగరేయడం....
అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలికి మా గాలిపటం విలవిలలాడడం..
అది తెగిపడడం ఇష్టంలేక మేమే దాన్ని నేలకు దించెయ్యడం....
ఎన్ని మధుర స్మృతులో!


‘పదపదవె వయ్యారి గాలిపటమా’ అన్నా,
 ‘చిలుకా పదపద’ అన్నాకళ్ళముందు
కదులుతుంది అందమైన గాలిపటం
ఆకాశంలో నాగుపాము బుసలుకొడుతున్నట్టు!

ఇన్ని స్మృతులను నా కిచ్చే
ఇదే గాలిపటం మైకం కలిగించి,
అజాగ్రత్త  పెంచి, కొందరి ప్రాణాలను బలికొందంటే
ఎంత బాధగా ఉంటుందో!

***********

No comments: