Thursday, January 18, 2018

చిట్టి కథకి ముగింపు- పుస్తకాలు నిలిపిన పసుపుకుంకాలు


Given Story: 
ఇంట్లోకి అడుగుపెట్టిన త్రిమూర్తికి అంతా బోసిపోయినట్టనిపించింది. దరహాసంతో వచ్చిన కొడుకు
"డాడీ నీకో సర్ ప్రైజ్... ఇంట్లో సంవత్సరాలుగా మూలుగుతున్న వాటిని తీసి పాతసరకు కొనేవాడికి ఇచ్చేసాను.మంచి రేటు వచ్చింది.ఆ డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొన్నాను.నెలకు రెండొందల నెట్ ఆఫర్తో ప్రపంచాన్ని చూడవచ్చు", అన్నాడు. త్రిమూర్తి కళ్ళు తిరిగినట్టయింది. ఐదువేల పుస్తకాల విలువైన ఇంటి గ్రంథాలయం కనిపించకపోవడంతో స్పృహ తప్పి పడిపోయాడు ...

My Conclusion:

పుస్తకాలు నిలిపిన పసుపుకుంకాలు

             ఆసుపత్రిలో త్రిమూర్తి ‘నా పుస్తకాలు... నా పుస్తకాలు’, అని మధ్య మధ్య అరవసాగాడు. చుట్టాలింట్లో పెళ్ళినుంచి తిరిగొచ్చిన భార్య, మణి, చెంగంచుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటోంది. ఈలోగా డాక్టర్ వచ్చి, “ఆయన మనసుకి గాయం తగిలింది. వెంటనే, ఆయన పోగొట్టుకున్న పుస్తకాలు కొనండి. కొనలేకపోతే, కనీసం లైబ్రరీ నుంచైనా తెప్పించండి”, అన్నారు.

          విషయం కనుక్కున్న మణి షాక్ తింది. అయిదు వేల పుస్తకాలు కొనడం మామూలు మాటలా? కొడుకు నిరూప్ ని పిలిచి ఆ పాత వస్తువులు కొనే మారయ్య దగ్గరకు వెళ్ళి పుస్తకాలు తెమ్మంది. విషయం తెలుసుకున్న మారయ్య త్రిమూర్తి పరిస్థితిని కాష్ చేసుకోదలిచి పాతిక వేలడిగాడు. పిల్లాడిలో స్మార్ట్ ఫోన్ కొన్న కళ పోయింది. ఆసుపత్రికొచ్చి తల్లితో ఈ విషయం చెప్పిన వెంటనే, ఆమె మౌనంగా ఉండిపోయింది. కొంత సేపటికి తేరుకుని, వాడిచేత  పసుపుతాడు తెప్పించి, మెడలో దాన్ని కట్టుకుని, పిల్లాణ్ణి తండ్రి దగ్గర ఉండమని చెప్పి, పుస్తెలు తాకట్టుపెట్టి, డబ్బు తెచ్చి పుస్తకాలను విడిపించుకుంది.
              ఈ విషయం భర్తతో చెప్పిన వెంటనే అతను కోలుకునే సూచనలు కనిపించాయి.
*****************

No comments: