1.
పుస్తకం హస్తభూషణమొకప్పుడు
ఇప్పుడు ఆ స్థానం చరవాణిది
పుస్తకం జ్ఞానాన్ని పెంచె,
కాని అజ్ఞానం పంచి
చెరలోన బంధించె
మధుర చరవాణి.
2.
నాడు కాలం గడుచుట కష్టమయ్యె
అప్పుడు చరవాణి పరిచయమయ్యె
చెరలోన బంధించె
మధుర చరవాణి
నేడు అవసరానికి
కాలం కరువయ్యెనో వాణీ!
3. చెరలోన బంధించె
మధుర చరవాణి
మొదట మాటల తీపిని తెలియజేసె
మనోవేగమున చిట్టి సందేశాలందజేసె
ఇప్పుడు నన్ను ‘స్మార్ట్’
గా జేసె గదా!
4.
‘స్మార్ట్’ ఫోనున్న ‘స్మార్ట్’ మనిషిననుకొంటి గాని
చెరలోన బంధించె
మధుర చరవాణి
ఫోను లేక దిక్కు
తోచదు నాకు
నెట్టుపోయిన పైప్రాణముల్
పైనే పోవు.
*****
No comments:
Post a Comment