Tuesday, January 2, 2018

చిత్ర కవిత- నేనేవర్నంటే......


నేనేవర్నంటే......
‘ప్రజల వద్దకు పాలన’ లా పర్యాటకుల వద్దకు చిరుతిళ్ళు తీసుకు వెళ్తాను
నా నాలుగు చక్రాల నేస్తంతో మా ఊళ్ళో ఉన్న పర్యాటక కేంద్రాలన్నీ తిరిగాను
గయుళ్ళు చెప్పే విశేషాలన్నీ విన్నాను, ‘గయుడా’వధానం చేయగలను.



ఎండాకాలంలో బండి నీడలో సేద తీర్చుకుంటాను
వానాకాలంలో గిరాకీ ఉండదు కనుక పొలంపనులు చేస్తాను
చలికాలంలో వేడి వేడి టీ నా స్పెషాలిటీ

పిల్లలకి నేనంటే ఇష్టం
అందుకే కలిగించను వారికి ఏ కష్టం
నేనమ్మే వస్తువుల్లో ఆరోగ్యం గ్యారంటీ!

చేసేది ఏ పనైనా నిర్మలమైన మనస్సుతో చేస్తే
ప్రజలకి నమ్మకం కుదురుతుంది
నమ్మకస్తుణ్ణని నన్ను నమ్మితే నాక్కావలసిందింకేముంది?

ఇంతకీ నేనెవర్ని?
నాయకుణ్ణి కాను, పర్యాటకుణ్ణీ కాను,
త్రిలోక సంచారిని కానేకాను, గయుణ్ణి అసలే కాను,
రైతుని కాను, నా టాలెంట్ ని ‘టీ’తోనే పరిమితం చెయ్యలేను
పిల్లల మాంత్రికుణ్ణి అయ్యే అవకాశమే లేదు
బ్రాండెడ్ తిళ్ళ ఏజెంటు అవలేను
ప్రజల మన్ననలు పొందగోరే సెలబ్రిటీని కాను
కేవలం చిరుతిళ్ళు అమ్మే వాడినీ కాను
వచ్చిన దానితో జీవితం సంతృప్తిగా వెళ్ళబుచ్చే
సగటు మనిషిని, ఓ అల్పసంతోషిని!
***************

No comments: