దివ్య కాంతి
ఒకే రకం పక్షులు
నేస్తాలవుతాయి
మనుషులం మాత్రం అలా స్నేహం
చెయ్యం
ఓ దేవా, నీ దివ్య కాంతి మాపై
ప్రసరించు,
మాలో స్నేహం పెంపొందించు.
ఒక పక్క ప్రపంచం
చిన్నదౌతోంది
మరోపక్క స్వార్థం మానవులపై
గెలుస్తోంది
ఓ దేవా, నీ దివ్య కాంతి మాపై
ప్రసరించు,
వసుధైవకుటుంబకాన్ని
స్థాపించు.
మనుషుల తెలివితేటలు రోగాలపై
విజయం సాధిస్తున్నాయి
కొత్త రోగాలు
పుట్టుకొస్తున్నాయి
ఓ దేవా, నీ దివ్య కాంతి మాపై
ప్రసరించు,
మా భూమిలో రోగాల బాధలను
నివారించు.
ప్రపంచ సంపద పెరుగుతోంది
సంపన్న- పేదల మధ్య అంతరం
కూడా అంటే!
ఓ దేవా, నీ దివ్య కాంతి మాపై
ప్రసరించు,
సర్వ మానవ సమానత్వాన్ని
స్థాపించు.
మా వినోదానికి బోలెడు మార్గాలు
కానీ మాలో సంతోషం మృగ్యం
ఓ దేవా, నీ దివ్య కాంతి మాపై
ప్రసరించు,
మాలో సంతోషాన్ని
పెంపొందించు.
*******************
No comments:
Post a Comment