Saturday, January 6, 2018

గద్య పూరణము- keywords-రోజులన్ని పొంగిపొర్లె సంతసాల పొందికలో

1.     అమ్మమ్మ మురిపాలతో, తాతయ్య నీతి కథలతో
రోజులన్ని పొంగిపొర్లె సంతసాల పొందికలో
సొంత ఊరుకి తిరిగి వచ్చు రోజు రాగ
కన్నీరు మున్నీరుగా కార్చె నా కనులు.

2.        రోజులన్ని పొంగిపొర్లె సంతసాల పొందికలో
   పెళ్ళైన కొత్తలో ఎటు చూసిన ఆనందపు హరివిల్లే
   కొత్త పాతయిన వెంటనే తప్పులు గుర్తుకొచ్చె
   ఇపుడు రోజులు గడిచె కొట్లాటలతో!
3.     మొదటి సారి అమెరికా చూడ
ఉత్సాహం గంతులేసె నాలో
అక్కడ విలువలకున్న విలువ చూసి
రోజులన్ని పొంగిపొర్లె సంతసాల పొందికలో!

4.     నేను ఇష్ట పడిన వాడె మనువాడగ రాగ
ఇంట వెల్లి విరిసె ఆనందాల పంట
రోజులన్ని పొంగిపొర్లె సంతసాల పొందికలో
పెళ్ళికింక రెండు మాసములున్నను.
5.     పెద్ద చదువు చదివి, గొప్ప నౌకరీ చేయగ
గొప్పయనుకుంటి నానాడు వెర్రి వానివోలె
రోజులన్ని పొంగిపొర్లె సంతసాల పొందికలో”
అను మాట మిగిలె మృగతృష్ణ వోలె.


*****

No comments: