Thursday, January 4, 2018

గద్య పూరణము- keywords- అమ్మ కన్న మిన్న అవనియందెవరన్న

1.     అమ్మ కన్న మిన్న అవనియందెవరన్న
అన్నంతనే ఈ కొత్త తరం వారికి కోపం వచ్చున్
అమ్మ కన్న మిన్న మా మొబైలేనంచు
వాదించుచుందురు వీరికి బుద్ధెట్లు వచ్చునో!


2.   ప్రపంచ మనుజులలోకెల్ల ఎవరు గొప్పని
యుపాధ్యాయుడడుగ జవాబు జెప్పిరి కొందరు
నేనన్న మాట అందరికి నచ్చెనెందుకనగా
అమ్మ కన్న మిన్న అవనియందెవరన్న!

3.   అమ్మయన్న నాకమిత ప్రేమ ఏలననడుగ
అమ్మ కన్న మిన్న అవనియందెవరన్న
యని జవాబిత్తును నేను ఆది గురువామె తండ్రి
గురువు దైవములామె పిమ్మటే వత్తురు గదా!

4.    నా భర్తయు నేనును వాదులాడుకొందుము
ఎవరి తల్లి గొప్పదోయని తేల్చుటకొరకు
అమ్మ కన్న మిన్న అవనియందెవరన్న
మాట ఇద్దరూ గొప్పవారేనని నిరూపించున్.
*********** 

No comments: