Thursday, January 4, 2018

గద్య పూరణము- keywords-చూడగానే మనసు గెంతులేస్తోంది..!!

1.     చరిత్రలో ఎనభై ఒకటి
ఆంగ్లంలో కూడా అంతే
ఇన్ని మార్కులిచ్చిన మార్క్ షీట్
చూడగానే మనసు గెంతులేస్తోంది..!!

2.    ఆ అబ్బాయిని చూడగానే మనసు గెంతులేస్తోంది..!!
  ఎందుకంటే నన్ను ప్రేమించే ధైర్యం చేసిన
  మొదటి వ్యక్తి, నేను బోల్డు టైపని తెలిసినా!
  ఇలాంటి వాణ్ణే చేసుకోవాలనుకున్నాను కదా!

3.     మా పాపాయిని జూకి తీసుకుని వెళ్తే
ఆమెకొకటే సంతోషం, హుషారూ
రకరకాల జంతువులని
చూడగానే మనసు గెంతులేస్తోంది ఆమెకు!!
4.     మొదటి జీతం చేతికి వచ్చింది
దాన్ని  చూడగానే మనసు గెంతులేస్తోంది
దానితో కొనాలి అమ్మానాన్నలకి బట్టలు
చెల్లెలికో చుడీదార్ సెట్టు మరి!
5.     మా అబ్బాయి తెచ్చాడు నాకో పట్టు చీర
మా వారికో పట్టు పంచెల జత
వాటిని చూడగానే మనసు గెంతులేస్తోంది
పుత్రోత్సాహమంటే ఇదేనేమో మరి!


******

No comments: