Saturday, January 20, 2018

గద్య పూరణము- keywords- ' కల' , 'అల' , 'తల', 'వల'

1.     ‘కల’లు కంటూ కాలక్షేపం చేసే నేను
 ఊహల ‘అల’లపై తేలిపోతుంటాను
  నిజం వెక్కిరిస్తే పేలిన నా ‘తల’
  పట్టుపట్టి ఆ’వల’కు నన్ను నెట్టింది.

2.     ప్రేమ’వల’లో చిక్కినవారొకరౌ తరుణాన
‘కల’లు నేరవేరగ పొంగెనానందము
 ’అల’లై వరుని మనసునందు
‘తల’ను పూలజడతోముస్తాబై వధువు రాగ.

3.     మానసిక రోగి కలల వలలో చిక్కి,  
భ్రమసిన తలతో నీడ- నిజాల తేడా కోల్పోతే
డాక్టర్ అదిగో...అల్లదిగో అని  నిజాన్ని చూపి,
 అలలలాంటి అతని కల్లోల మనసుని శాంతింపజేశాడు.

4.     “అల, కల, వల వ్రాయి పలకలో”
అని చిన్న చిన్న సరళమైన మాటలతో
అందరినీ ఆకట్టుకునేదే కవిత్వమని
బాగా తలకెక్కించుకో ఓ ఆకతాయీ!

****

No comments: