Tuesday, July 3, 2018

Monday, July 2, 2018

చిత్రకవిత- పొగ వదలకు- ప్రాణాన్ని వదులుకోకు




పొగ వదలకు- ప్రాణాన్ని వదులుకోకు
‘నేను గురజాడ వారి అభిమాని’నని
గిరీశాన్ని ఆదర్శంగా తీసుకునే ఓ వెర్రి కుర్రవాడా!
గిరీశం ద్వంద్వ ధోరణి మరిచావా?
‘కన్యాశుల్క’పు వ్యంగ్య వైభవాన్ని విడిచావా?
ధూమపానం చేయకపోతే దున్నపోతై పుట్టుదువు గాక!
కాన్సర్ రోగిలా చచ్చి బతక్కు!

స్వీయ కవిత- Theme- "యువతరం ప్రేమాయణం"--- ఆన్లైన్ ప్రేమ


ఆన్లైన్ ప్రేమ
మొదటి రోజు ఛాటింగు
రెండో రోజు డేటింగు

Wednesday, June 27, 2018

స్వీయ కవిత- Theme-"విదేశీ విద్యా మోజు.......అక్కడ నానా కష్టాలే ప్రతి రోజు"- కష్టే ఫలే


కష్టే ఫలే
విదేశీ విద్యంటే ఎందుకుండదు మోజు?
ఈనాటి మన దేశపు చదువులు మనకు మనోవికాసం కలిగిస్తాయా?
కష్టపడి చదివేవాడికి సరైన ప్రోత్సాహం ఉంటోందా?
వాడి ప్రతిభకు తగ్గ ఉద్యోగం వస్తోందా?
పరీక్షల సీసన్ లో ఏ వార్తా పత్రిక తిరగేసినా, కాపీలు కొట్టే వారి కథలే
చదివినా చదవకపోయినా పై తరగతికి వెళ్ళిపోయి, చదువొచ్చినట్టు భుజాలు ఎగరేయడమే!
ప్రతిభను గుర్తించని చదువు నాకొద్దు

Wednesday, June 20, 2018

చిత్రకవిత- సూర్యుడికి కోపం రాదు మరి?






సూర్యుడికి కోపం రాదు మరి?
వడ దెబ్బ  తట్టుకోలేకపోతున్నావా?
నువ్వెన్ని చెట్లు నరికావో గుర్తు తెచ్చుకో...
ఆ వడ దెబ్బకి నువ్వెంత సాయం చేశావో తెలుసుకో!  

Monday, June 18, 2018

స్వీయ కవిత- Theme-"వైద్యో నారాయణో హరీ..... రొక్కముంటేనే" -సార్థకం



సార్థకం
వైద్యం చేయదానికి రోగి ఉంటే చాలు
అది ఆనాటి మాట
అందుకే వైద్యో నారాయణో హరీ అన్నారు!

Tuesday, June 12, 2018

చిత్రకవిత- నినాదం- నిజం


నినాదం- నిజం
“బాల కార్మిక నిషేధం జరగా”లంటూ
నినాదాలు చేస్తే సరిపోతుందా?
మన చేతలలో నిర్మూలించాలి గాని...
బాలల చేత పనిచేస్తే చౌక అవుతుందని
మనం ఆశ పడినంత వరకూ  
ఈ రక్కసి చేస్తుంది విలయతాండవం!

స్వీయ కవిత- Theme- దేహము నీటి బుగ్గ..... జీవితము నీటి బుడగ...... మెండైన వ్యామోహము ........- ఇదేం వింతో గాని...


ఇదేం వింతో గాని...
నీటి బుగ్గ సలసలా కాగుతోందని అబ్బురపడిపోతాం ...
మన జీవితమే కాగి అవిరవడానికి సిద్ధపడుతోందని గ్రహించం!

Thursday, June 7, 2018

చిత్రకవిత- బరువులేని బాల్యం



బరువులేని బాల్యం
చదువుకునేటప్పుడు చదువుకుని
రకరకాల ఆటలాడుకోవడం ఎంత బాగుంటుందో

Monday, June 4, 2018

స్వీయ కవిత- Theme- ఉప్పొంగిన ఉల్లాసపు సడిలో ఉబికిన కన్నీటి ధారలు



1.   ఓటమినెదుర్కునేందుకు సంసిద్ధమయ్యానానాడు
మరో అవకాశం కోసం ఆగాలి ఆర్నెల్లు
ఆ ఎదురుచూపులలో ఓ శుభోదయాన వరించె నన్ను విజయమ్ము
ఉప్పొంగిన ఆ ఉల్లాసపు సడిలో ఉబికెను కన్నీటి ధారలు!

Friday, June 1, 2018

చిత్రకథ-Theme-ప్రేమ ఇద్దరు వ్యక్తులు ఇరువైపులా లాగిపట్టుకున్న రబ్బర్ బ్యాండ్ లాంటిది.ఒకరు విసిగి విడిచిపెడితే అది అవతలవ్యక్తిని బాధ పెడ్తుంది "- యాంత్రిక బంధం


యాంత్రిక బంధం
                       “రబ్బర్ బ్యాండ్ లాగి కొట్టినట్టు ఏమిటా మాట? కావాలంటే నన్ను కొట్టు. మాటలతో కాదు”, అన్నాడు మహేష్, భార్య విమలతో. “నేను అనకూడని మాట అనలేదుగా! విడాకులు తీసుకుందాం”, అంది ఆమె. “మళ్ళీ అదే మాట! సరదాకి కూడా అలాంటి మాట అనకు”, అన్నాడు మహేష్.

Wednesday, May 30, 2018

స్వీయ కవిత- వెన్నెల రేయి అలకేలనోయి- కౌసల్య విన్నపము

కౌసల్య విన్నపము:

చందురుని కోరిన అద్దంలో చూపారు నాన్న
మరిక అన్నం వద్దని మారాము చేసెదవేలా?

చిత్రకవిత-ప్రేమ లాల



ప్రేమ లాల

మబ్బుల మెత్తటి పరుపు లేదు
కాయకష్టం చేసిన నా కాళ్ళే పరుపు.

Wednesday, May 23, 2018

చిత్రకవిత- మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చెయ్యకు




మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చెయ్యకు

మొక్కలు నాటామని లెక్కలు చెప్తే చాలదు
వాటిని సరిగ్గా సాకామా లేదా చూసుకోవాలి
నీళ్ళు మాత్రమే పోస్తే సరిపోదు
కాలుష్యపు పదార్థాలు లేకుండా చూసుకోవాలి.

Wednesday, May 16, 2018

చిత్రకవిత- ఆ కళ్ళు చాలు




ఆ కళ్ళు చాలు
‘అందమే ఆనందం’ అని పాడిన ఈమె అందానికి అందం
ఏమిటో ఆ మాయ! నటనలో చాకచక్యం ఆమె సొంతం

Wednesday, May 2, 2018

చిత్రకవిత- చిట్టితండ్రి



చిట్టితండ్రి
పుట్టింది రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబంలో
ఆకలి అలవాటైన అతనికి, కట్టేందుకు బట్టలు కూడా కరువే!
ఆడిపాడాల్సిన పసితనంలో వయసుకి మించిన భారం మోస్తున్నాడు-
చంకలో ఉన్న తమ్ముడు కాదు, వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత
ఆ పసితతనపు అమాయకత్వం మిగిలిన పిల్లలు వెకిలిగా నవ్వినా పట్టించుకోదు
వాళ్ళకేం తెలుసు, ఆ మనసులో ఏముందో?

చిత్రకవిత- ఆధునిక అన్నపూర్ణ


ఆధునిక అన్నపూర్ణ
పేదరికం పాత విషయమే
ఆకలి కూడా అంతే
ఆకలి గొన్నవారికి కూసింత
బువ్వ పెడితే అన్నపూర్ణ అనేవారు.

Thursday, April 12, 2018

చిట్టి కథ - Sentence- "నాను బతికి సెడిన వోన్ని బాబయా...మీరు సెప్పే పాపం పనులు సేస్తూ సెడి బతకలేను...దండాలండీ" (మాండలికంలో)- ఆత్మస్థైర్యం


ఆత్మస్థైర్యం
అదో మోస్తరు పల్లెటూరు. అందులో పిపీలకం లాంటి వెల్డర్ కాశీ. చేసేవి చిన్నా, చితకా పనులైనా శ్రద్ధగా చేస్తాడు. ఆ కారణంగా ఊళ్ళో మంచి పేరుంది. “నువ్వు చేసే పని దుబాయ్ లో చేస్తే లక్షలకు లక్షలు సంపాదించచ్చు”, అని ఓ పెద్ద మనిషి ఉచిత సలహా ఇస్తే, ఉన్న కాస్త పొలమూ అమ్మేసి, అర్జంటుగా ఓ ఏజెంటు దగ్గరికి వెళ్ళాడు. పూర్వాపరాలు వాకబు చేయని పాపానికి వాడు కాశీని నిలువునా ముంచాడు.

Tuesday, April 10, 2018

చిత్రకవిత- అల్పసంఖ్యాకులు


అల్పసంఖ్యాకులు
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి
చీకట్లో చిరుదీపం వెలిగించి
బండ రాళ్ళని పెళ్ళగించి
ఇంతింత-ఇంతింత బయటకు తెచ్చి
ఆ నల్ల బంగారాన్ని అప్పగిస్తే
అనుకున్నదానికన్నా జీతం తక్కువిచ్చి
నల్లధనాన్ని పెంచుకుంటారొకరు.

Saturday, April 7, 2018

గద్య పూరణము- గుంటూరు శేషేంద్ర శర్మ గారి "నా దేశం నా ప్రజలు" కవితా సంపుటి వరుస



శిక్షణ
1.     పసి పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే పోషక పదార్థాల్లా, శిక్షణకోసం అధికారులు వస్తే, వృత్తిలో ఎదుగుదలకి కావలసిన నైపుణ్యాన్ని ప్రసాదింపజేశాను. పసిపిల్లలకి నీతి కథలు చెప్పినట్టు, వాళ్ళ ఉగ్గుపాలలో విలువల తేనెని కలిపి, తాగించాను.