Monday, March 13, 2017

చిట్టి కథ – Keywords- “మా బాగా చెప్పారు.... ఇక దయచేయండి” title: కూసే మనుషులు


          ఆ రోజు ఆఫీసులో ఒకటే హడావుడి. ఎంత సౌండ్ ప్రూఫ్ గదిలో ఉన్నా ఆ అరుపులు అవినాష్ చెవిని పడ్డాయి. ఆ ప్రభుత్వ ఫ్యాక్టరీలో మానవ వనరుల మేనేజర్ గా పని చేస్తున్నాడు గనుక అతను వెంటనే అప్రమత్తుడై బయటకు నడిచాడు. చూడబోతే, ఓ వంద మంది ఉద్యోగులు, “యాజమాన్యం డౌన్ డౌన్”, అని నినాదాలు చేశారు. అతణ్ణి చూసిన వెంటనే, “పనికిమాలిన హెచ్చార్ మేనేజర్ ఇంటికి వెళ్ళాలి”, అని కూడా అరిచారు.

చిట్టి కథ –keywords – “పక్కపక్కనే దగ్గరగా కూర్చుని ఉన్నా ఆమెకూ అతనికీ మధ్య నిశ్శబ్దపుగోడ నిలబడే ఉంది!"---చిత్తు కాగితం తీర్చిన కష్టం


పెళ్ళైన అయిదేళ్లకు పుట్టిన ఒక్కగానొక్క నలుసు, పదేళ్ళ శరణ్యకి బాగా జబ్బు చేసింది. ఒళ్ళంతా నీలంగా మారుతుంటే, ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తే రక్తనాళాల కాన్సర్ అని డాక్టర్ నిర్ధారించారు. అద్దె ఆటో తోలే అతనికి, నాలుగిళ్ళలో పాచిపని చేసుకునే ఆమెకి, పిల్లని బ్రతికించుకోవడం ఎలాగో అర్థం కాలేదు. 

Sunday, March 5, 2017

చిట్టి కథ- Keywords- అసలు విషయం తెలుసుకున్న అద్వితి కన్నుల్లో గిర్రున కన్నీళ్ళు తిరిగాయి- సర్ప్రైజ్


“ప్రతీసారీ నన్ను గంటల కొద్దీ వెయిట్ చేయిస్తావు నీకిదేం వికృత సంతోషం అద్వితీ?” అన్నాడు అపురూప్. “నీకేం బాబూ, మగ మహారాజువి. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఎవరూ పట్టించుకోరు. నేనేమో ఆడపిల్లని. హాయిగా నా బతుకు నేను బతుకుతుంటే ఈ ప్రేమలో పడేశావ్. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళే నేను అబద్ధం నేర్చుకుంటున్నాను. కారులో వస్తే ఇంట్లో తెలిసిపోతుందని స్పెషల్ క్లాస్లున్నాయని ఇంట్లో చెప్పి, నీ కోసం రెండు బస్సులు మారి వస్తున్నాను. నీకు మంచి ఉద్యోగం వచ్చి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వి అయ్యేదాకా ఇవి భరించలిలే”, అంది అద్వితి.

Wednesday, March 1, 2017

దేశరక్షణకి ఉడుత సాయం




1.     దేశరక్షణ కేవలం సైన్యపు బాధ్యత అనుకోకు
మన దేశ పౌరుడిగా అది నీ బాధ్యత కూడా!

Thursday, February 23, 2017

Keywords: ఆత్మావలోకనమే ... మోక్షానికి మార్గం నమ్మకద్రోహం




1.     1.     చిన్నప్పుడు స్నేహితురాలికి నాట్య ప్రదర్శన కోసం పట్టుపరికిణీ ఇస్తే చింపి తెచ్చింది
తను చేసిన తప్పుకి ఇసుమంతైనా బాధ పడలేదు.

Wednesday, February 22, 2017

తెలుగుని అంతర్జాతీయ భాషగా మార్చాలంటే....




తెలుగుని అంతర్జాతీయ భాషగా మార్చాలంటే...
1.     పరభాషని తెలుగులో మిళితం చేసి గొప్పగా మాట్లాడితే సరిపోదు
తెలుగులో వాక్శుద్ధి, వ్రాతశుద్ధి ఉండాలి.

Monday, February 20, 2017

ఎంబీ వద్దు- జీబీ ముద్దు

(published in a magazine meant for private circulation)
          ‘ఛీ, నాదెంత పనికిమాలిన బ్రతుకు, ముచ్చటగా మూడో సారి కూడా నా వీసా రిజెక్ట్ అయిపొయింది’, అని తిట్టుకున్నాడు సామంత్. “అదే దేవుడుగనుక కనిపిస్తేనా, ఛెడా మడా కడిగేద్దును”, అనుకుంటూ తన కష్టాన్ని మరచిపోడానికి నిద్రకుపక్రమించాడు.

Saturday, February 11, 2017

చిట్టి కథ- మనస్పర్థలు

చిట్టి కథ : చెయ్యి పట్టి బతిమాలుతున్న అతని చేతిని విసిరికొట్టి, వెళ్ళిపోయిన ఆమెను, అతను నిస్సహాయంగా చూస్తూ  ఉండిపోయాడు. 
మనస్పర్థలు
వాసంతి, ఋతురాజ్ లకి పెళ్ళయ్యి ఏడాది కావస్తోంది. వాళ్ళిద్దరూ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు కాబట్టి అప్పుడప్పుడు మాటా మాటా పెరగడం జరిగిపోతూ ఉండేది. కొంత సేపటికి ఇద్దరూ సర్దుకుపోయేవారు. పెళ్ళి రోజుని ఇద్దరూ ఏకాంతంగా వాళ్ళింట్లోనే గడుపుదామని ఆశపడ్డారు. కానీ, ఆ రోజు పొద్దున్నే ఋతు వాళ్ళ బాస్ నుండి ఫోన్ వచ్చింది. ఆనివర్సరీ విషెస్ చెప్పదనికేమో అని ఫోన్ ఎత్తాడు. తీరా చూస్తే, అమెరికన్ క్లైంట్ ఏదో బగ్ ని ఫిక్స్ చేయమని కోరారట. అది ఆఫీసులో ఋతు తప్ప మరెవరూ చేయలేని పణత. ఆఫీసుకి రమ్మని కోరాడు.

Wednesday, February 8, 2017

జాలంతో జలకాలాటలు



1.     సాలీడు పట్టు దారాలతో గూడు కట్టుకుంటుంది,
దారేపోయే కీటకాలను ఆకట్టుకోవాలని
దొరికిన వాటిని దొరికినట్టే బలమైన బంధాలతో బంధించి
తన కడుపు నింపుకుంటుంది.

Tuesday, January 31, 2017

ఓ చదువుల తల్లీ! జ్ఞానం పెంపొందించమ్మా!



1.     నీవే మాకు విద్యాదాతవు
నీ రూపాలన్నీ మాకు పవిత్రమే
చిన్నప్పుడు పుస్తకాలు, కలం నీ ముందు పెట్టి నీ ఆశీర్వాదం కోరేవాళ్ళం
ఇప్పుడు కంప్యూటర్, ట్యాబు, మొబైల్ వగైరాల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమంటున్నాం.

Friday, January 27, 2017

చిట్టి కథ: ఆమె తడబడింది....కానీ నిలబడింది- గులకరాయి నేర్పిన గుణపాఠం

చిట్టి కథ: ఆమె తడబడింది....కానీ నిలబడింది.
గులకరాయి నేర్పిన గుణపాఠం
ఆమెకు జీవితంపై విరక్తి పుట్టింది. ప్రేమించిన భర్త ప్రేమగా చూసుకోకపోగా ఇద్దరు టీనేజ్ అబ్బాయిల ఎదురుగా తనని గొడ్డుని బాదుతున్నట్టు బాదుతున్నాడు. తండ్రిని దారిలోకి తెచ్చుకోలేని నువ్వు మాకేం నీతులు చేపుతవులే, పో, అనే పుత్రులు.....

Wednesday, January 25, 2017

ఏదీ ఆ స్వాతంత్ర్యం?



1.     స్వాతంత్ర్యమంటేవిదేశీయుల పాలన నుండి విముక్తిమాత్రమే కాదు
స్వాతంత్ర్యమంటే స్వదేశీయులకి కడుపు నిండా అన్నం దొరకడం
స్వాతంత్ర్యమంటే భారతీయులకు తమ వారి దోపిడీ నుండి విముక్తి లభించడం
అర్థ రాత్రి స్త్రీ ఇంట, బయటా క్షేమంగా ఉండడం
చిన్నపిల్లలకి వాళ్ళ బాల్యం లభించడం

Wednesday, January 18, 2017

స్వాతంత్ర్యపు దుర్వినియోగం



1.     మాకు స్వాతంత్ర్యం లేదు
మీ మనుషులు మమ్మల్ని కట్టేస్తారు
మా దూడల మూతుల కట్టి మా పాలను కాజేసి, కల్తీ చేసి అమ్మేస్తారు
మీ అసలు నైజం తెలియక మీరేదో మాకన్నా గొప్పవారనుకుంటాం.

Wednesday, January 11, 2017

రోగానికి వైద్యం


1.       మీ దేశంలో ఆడవాళ్ళకి గౌరవప్రదమైన స్థానం లేదంటే
ఆడదంటే ఆదిశక్తి అంటావ్
ఆడది కనిపిస్తే మాత్రం వెంటనే రోడ్ రోమియోవి అయిపోతావ్.

Tuesday, January 3, 2017

వృక్షరాజు దీనావస్థ



1.     ఓ వృక్షరాజమా! కీకారణ్యంలో వేళ్ళూ, కొమ్మలూ పరచుకుని దర్జాగా జీవించే నీకు ఏమి దీనావస్థ కలిగిందో కదా!
మనవ కంకరారణ్యంలో డాబు కోసం చూపే బక్క ప్రాణివయ్యావా?

Tuesday, December 27, 2016

పెళ్ళంటే?



1.     పెళ్ళంటే ఖరీదైన దుస్తులు, నగలు కాదు
పెళ్ళంటే అవగాహన అనే ఒక పవిత్ర బంధం

Wednesday, December 21, 2016

ఓ మనిషీ ఏం చేస్తున్నావీ భూమిని?



అప్పుడు-
పచ్చని చెట్లలో రకరకాల పక్షుల గూళ్ళుండేవి
ఇరు సంధ్యల్లో కిలకిలా రావాలు వినిపించేవి

Tuesday, December 13, 2016

పచ్చదనంతో చేయి కలపవోయ్




1.     భూమి వేడెక్కుతోందని గోలపెడితే చాలదోయ్
ఆ వేడికి ఆవిరి పోసిన నీ ఏసీని గుర్తు తెచ్చుకో!

Wednesday, December 7, 2016

స్వార్థం పోయేదెప్పుడు?

1.    



పసుపు, ఎరుపు రంగుల కలయికే సంధ్య
ప్రాతస్సంధ్యైతే అది ఒక రోజుకి శుభారంభం
ఎన్నో ఆశలు ఫలించడానికి మొదటి మెట్టు
పక్షులు పొట్టకూటికి బయలుదేరే సమయమది.

Saturday, December 3, 2016

Litmus Tests

(published in an in house magazine)
This is stylized version of a few real life incidents, narrated in the first person.

***
               The ‘tring tring’ sound distracted me from my computer. I was trying to shoot a bug for the past two hours in vain. I took my sight off the monitor and transferred it to the mobile. A cheerful, familiar face smiles at me, with its name, ‘Ravi’, superscribed on the top. At 16:15hrs, it was quite unusual for Ravi to call me. I wondered what would have gone wrong.