I grew up on the East Coast of India, so I'm particularly fond of the Sun and the Sea and hence the title which means sea shore in Telugu. If everyone saw the best of photographs, and read only the best writings, where's the opportunity for the alsorans to showcase their talents( or the absence of them)?
Wednesday, May 24, 2017
Tuesday, May 2, 2017
Tuesday, April 25, 2017
Sunday, April 23, 2017
చిట్టి కథ keywords" అతను/ ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు ..."- వుడా పార్కు వృద్ధ గురువు
గృహిణినైన
నేను రోజూ సాయంత్రం నాలుగున్నర- ఐదున్నర గంటల మధ్య కొత్త వుడా పార్కు లోని వాకర్స్
పారడైస్ లో నడవడం అలవాటు. ఒకపక్క పనిమనిషి పనైపోతుంది, మరోపక్క మా వారూ, పిల్లలూ
రావడానికి ఆరు దాటుతుంది. ఒక రోజు కాస్త నిస్త్రాణగా అనిపించి, ఒక బెంచి మీద
కూర్చున్నాను. సాయంకాలపు పిల్లగాలులు సముద్రం నుండి వీస్తాయి. చాలా ఆహ్లాదకరంగా
ఉంది. ఈ పని ఇదివరకెన్నడూ ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తున్నంతలో ఒక వృద్ధుల సమూహం
వచ్చి మిగతా బెంచీల మీద స్థిర పడ్డారు.
Wednesday, April 19, 2017
Wednesday, April 12, 2017
Wednesday, April 5, 2017
పేదరికం విలువ
1.
పేదరికం ఎరుగని ఓ తల్లిదండ్రులారా!
పేదరికం
ఎంత నికృష్టమైనదో తెలుసా?
తిండికి
మొహం వాచిన వారిని చూసి మొహం తిప్పుకుంటే చాలదు
లాప్టాప్
తో ఆడుకునే మీ చంటాడికి కొన్ని చూపండి
ఆడుకోవలసిన
వయసులో వయసుకి మించిన భారాలు మోసే పిల్లలను,
ఎడ్లని
మేపే చంటాళ్ళను, బాల కార్మికులై పొట్ట పోసుకునే వారిని-
వీరందరినీ
లాప్టాప్ లో చూపి పేదరికం విలువ నేర్పండి,
మీరు
పేదలు కానందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పండి.
Wednesday, March 29, 2017
ఉగాది స్పెషల్ చిట్టి (హాస్య) కథ-చాదస్తపు అత్త- గడుసరి కోడలు
ఒక్కగానొక్క నలుసు ఎనిమిదేళ్ళ చింటూకి తలంటి, కొత్త బట్టలేసి,
దేవుడికి దణ్ణం పెట్టించి, మామ్మ గారి చేతుల మీదుగా ఉగాది పచ్చడి తినమని పంపి
పిండి వంటలకి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుంటోంది పల్లవి. వాడు చటుక్కున ఏడుపుతో
తిరిగి వచ్చాడు. మామ్మ గారి గారాల మనవడెందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు
పల్లవికి. “ఉగాది పచ్చడి నువ్వు చేస్తే బాగుండేది. ఈ మాటు అంతా చేదుగా ఉంది...”
అని విషయం చెప్పి మళ్ళీ ఏడవ సాగాడు చింటూ.
Tuesday, March 28, 2017
Sunday, March 26, 2017
చిట్టికథ వాక్యం-(keywords) "నేనెవరో మీకు తెలియకపోయినా...మీరెవరో నాకు తెలుసు.మనిద్దరి పరిచయం ఈనాటిది కాదు". ----ఆశ్చర్యం
ఆ ఏరియాకి కొత్తగా
వచ్చినట్టు ఆమె బెరుకుతనం చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది. బిక్కమొహం వేసుకుని బిత్తర
చూపులతో అటూ ఇటూ చూస్తూ ఎలాగో బస్సు స్టాప్ కి చేరుకుంది. పావుగంటైనా ఇంకా బస్సు
రాలేదు.
Saturday, March 25, 2017
Wednesday, March 22, 2017
Monday, March 20, 2017
చిట్టి కథ – keywords- "అహాన్ని వీడిన రెండు పశ్చాత్తాప హృదయాలు పరస్పరం క్షమాకుసుమాలతో అభిషేకించుకున్నాయి"---అనుమానం- అహంకారం
“అనూహ్యా, వెనుక వీధి అనూప్ గారబ్బాయి అభిజిత్ కి హీమోఫీలియా వల్ల అంతః రక్త
స్రావం జరిగితే అతని రక్తానికి సరిపడే రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల చుట్టూ వారం
రోజులుగా తెగ తిరుగుతున్నవుట?’ అందామె తల్లి.
Sunday, March 19, 2017
దైవస్తుతి & గురుస్తుతి
దైవస్తుతి
1.
తే. గీ. జల్లెడ
పట్టి నేను జీవితం కథగా మలచినాను
ఎటుల తెలియు నాకు కవిత్వ మేమనడగ
కవిత రాయుమన్ జెప్పిన
కరుణ కలిగె
లంబ జఠరు నాశీస్సు లభించె
భాగ్యాన||
Saturday, March 18, 2017
Wednesday, March 15, 2017
Monday, March 13, 2017
చిట్టి కథ – Keywords- “మా బాగా చెప్పారు.... ఇక దయచేయండి” title: కూసే మనుషులు
ఆ రోజు ఆఫీసులో ఒకటే
హడావుడి. ఎంత సౌండ్ ప్రూఫ్ గదిలో ఉన్నా ఆ అరుపులు అవినాష్ చెవిని పడ్డాయి. ఆ
ప్రభుత్వ ఫ్యాక్టరీలో మానవ వనరుల మేనేజర్ గా పని చేస్తున్నాడు గనుక అతను వెంటనే
అప్రమత్తుడై బయటకు నడిచాడు. చూడబోతే, ఓ వంద మంది ఉద్యోగులు, “యాజమాన్యం డౌన్ డౌన్”,
అని నినాదాలు చేశారు. అతణ్ణి చూసిన వెంటనే, “పనికిమాలిన హెచ్చార్ మేనేజర్ ఇంటికి
వెళ్ళాలి”, అని కూడా అరిచారు.
చిట్టి కథ –keywords – “పక్కపక్కనే దగ్గరగా కూర్చుని ఉన్నా ఆమెకూ అతనికీ మధ్య నిశ్శబ్దపుగోడ నిలబడే ఉంది!"---చిత్తు కాగితం తీర్చిన కష్టం
పెళ్ళైన అయిదేళ్లకు పుట్టిన ఒక్కగానొక్క
నలుసు, పదేళ్ళ శరణ్యకి బాగా జబ్బు చేసింది. ఒళ్ళంతా నీలంగా మారుతుంటే, ఆసుపత్రికి
తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తే రక్తనాళాల కాన్సర్ అని డాక్టర్ నిర్ధారించారు. అద్దె
ఆటో తోలే అతనికి, నాలుగిళ్ళలో పాచిపని చేసుకునే ఆమెకి, పిల్లని బ్రతికించుకోవడం
ఎలాగో అర్థం కాలేదు.
Sunday, March 5, 2017
చిట్టి కథ- Keywords- అసలు విషయం తెలుసుకున్న అద్వితి కన్నుల్లో గిర్రున కన్నీళ్ళు తిరిగాయి- సర్ప్రైజ్
“ప్రతీసారీ నన్ను గంటల
కొద్దీ వెయిట్ చేయిస్తావు నీకిదేం వికృత సంతోషం అద్వితీ?” అన్నాడు అపురూప్. “నీకేం
బాబూ, మగ మహారాజువి. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఎవరూ పట్టించుకోరు. నేనేమో ఆడపిల్లని.
హాయిగా నా బతుకు నేను బతుకుతుంటే ఈ ప్రేమలో పడేశావ్. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో
చెప్పి వెళ్ళే నేను అబద్ధం నేర్చుకుంటున్నాను. కారులో వస్తే ఇంట్లో తెలిసిపోతుందని
స్పెషల్ క్లాస్లున్నాయని ఇంట్లో చెప్పి, నీ కోసం రెండు బస్సులు మారి వస్తున్నాను. నీకు
మంచి ఉద్యోగం వచ్చి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వి అయ్యేదాకా ఇవి భరించలిలే”, అంది అద్వితి.
Wednesday, March 1, 2017
Subscribe to:
Posts (Atom)














