Monday, August 20, 2018

స్వీయ కవిత- Theme- జల ప్రళయం -జన జీవనం కకావికలం- ప్రకృతి విలయతాండవం


ప్రకృతి విలయతాండవం
మానవులు వరదల వల్ల కష్టపడుతున్నారని బాధపడేవడా!
ఓ మానవుడా! వారి కష్టానికి కారణమెవ్వరు?
కొండలను పిండి చేసే యంత్రాలున్నాయని భుజాలెగరేసిందెవరు?
వాటిని పనిలోపెట్టి గొప్పలు కొట్టుకున్నదెవరు?

Monday, August 13, 2018

స్వీయ కవిత- Theme- వృద్ధాప్యంలో తల్లితండ్రుల పట్ల పిల్లల బాధ్యత, నేటి పరిస్థితి- నేను- నాది


నేను- నాది
తొమ్మిది నెలలు కడుపులో కాపాడి
స్వావలంబన వచ్చే వరకూ తమ రెక్కలతో
నన్ను రక్షించిన తల్లిదండ్రులని నేనిప్పుడు పట్టించుకోనోచ్!
ఎందుకంటే, ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా కదా!
కన్నాక వాళ్ళు నన్ను పెంచక మానరు కదా!

Monday, August 6, 2018

స్వీయ కవిత- Theme-మధురమైన జ్ఞాపకాల సవ్వడిలో


1.     అమ్మపోరుతో పాత పుస్తకాలు
సర్దడం మొదలుపెట్టిన నాకు
కనిపించింది వాటి మధ్య ఓ నెమలీక
ఆ ఈక తెచ్చిన మధురమైన జ్ఞాపకాల సవ్వడిలో
నా మనసు నెమలిలా నాట్యమడగా
సర్దుడు చెట్టెక్కె, అమ్మ నన్ను తిట్టె!

Wednesday, August 1, 2018

చిత్రకవిత- ఆరోగ్యకరమైన బాల్యం


ఆరోగ్యకరమైన బాల్యం
ఆటంటే బయటే!
గోళీలాట కావచ్చు
గిల్లీ డండా కావచ్చు
పరుపందేలు కావచ్చు
కోతి కొమ్మచ్చి కావచ్చు

Saturday, July 28, 2018

గద్య పూరణము- “ఊహల ఊయల వూగెనుగా .. “

1.    ఊహల ఊయల వూగెనుగా .. “ అంటూ
ఓ కర్ణకఠోర గాత్రం గొంతెత్తి పాడితే
సభలోని జనాల ఊహలు ఆవిరై
వాళ్ళని పారిపొమ్మని ఉసిగొల్పాయి!
  

Monday, July 23, 2018

స్వీయ కవిత- Theme-వరకట్న(ష్ట)ము- అసలు వాళ్లకి పెళ్ళౌతుందా?


అసలు వాళ్లకి పెళ్ళౌతుందా?
ఓ ఆడపిల్ల సందిగ్ధం:
నేను కొనుక్కున్న సీడీ
నాక్కావలసిన పాటలు పాడుతుంది
నేను కొనుక్కున్న కారు
నాక్కావలసిన చోటికి తీసుకు వెళ్తుంది
వీటి కన్నా ఖరీదుపెట్టి కొనుక్కోబోయే
భర్తతో సర్దుకుపొమ్మంటుంది మా అమ్మ,
అదేమి చోద్యమోగాని!

Sunday, July 22, 2018

చిన్న పిల్లని చూసి ....(గల్పిక)

చిన్న పిల్లని చూసి ....(గల్పిక)
              హోరు వాన కలిగించిన రోడ్డు వరదలు దాటుకుని, ఎలాగో ట్రెయిన్ ఎక్కాం నాన్నా, నేనూ! మా ఎదురు సీట్లో భార్యాభర్తలు, వాళ్ళ కూతురూ కూర్చున్నారు. నా దృష్టి చంటిపిల్లైన వాళ్ళమ్మాయి మీద పడింది. ఎంత ముద్దుగా ఉందో! సీరియస్ గా స్మార్ట్ ఫోనులో ఏదో వీడియో చూస్తూ కన్నడంలో వాళ్ళమ్మానాన్నలతో ముద్దు ముద్దుగా మాటలాడుతోంది. రెండేళ్ళు కన్నా ఉండవు. ఎంచక్కా స్మార్ట్ ఫోన్ ని వాడుతోందో! 

Friday, July 20, 2018

స్వీయ కవిత- Theme- ధనము-మానవత్వము- ఇవేం రోజులురా బాబూ!


ఇవేం రోజులురా బాబూ!
ఏవా రోజులు?
ధనవంతులు దానకర్ణులనే
పేరుకోసం పాకులాడిన రోజులు
మనకున్న దానిలో నలుగురి కడుపులూ
నింపాలనుకున్న రోజులు?

Tuesday, July 17, 2018

చిత్రకవిత- వానొస్తే...



వానొస్తే...
మండుటెండలు చెరిగేసే ఈ దేశంలో వానొస్తే ఎంతో హాయి
వాన తెచ్చే చల్లదనం కోసం ఎదురు చూస్తూ గడిపేస్తాం ఎండా కాలాన్ని
వానొస్తే మనకు మాత్రమేనా ఆనందం?

Sunday, July 15, 2018

స్వీయ కవిత- Theme- అంతర్జాల మాయాజాలంలో చిక్కిన మనీషి- సర్వం మాయే


సర్వం మాయే
వ్యసనాలకు దూరంగా ఉండే మనుషులు కూడా
ఈ మయాజాలంలో చిక్కుకుంటున్నారు
ముందు ఒక సౌకర్యంలా ఉద్భవిస్తుంది
తరువాత మరిన్ని సౌకర్యాలందిస్తుంది
అవీ, ఇవీ చూడమని ఉప్పందిస్తుంది
వాటి చుట్టూ ఒక ఉచ్చు బిగించి ఊపిరాడకుండా చేస్తుంది

Wednesday, July 11, 2018

చిత్రకవిత- ఓ యువతా, మేలుకో!



ఓ యువతా, మేలుకో!
ట్రెండీ బట్టలు వేసుకుని అంతా కులాసా అనుకోకు
దీపాల మిణుకు చూసి వెలుగనుకోకు
సంధ్యను చూసి పొంగిపోకు
అది వేకువో సాయంత్రమో తెలుసుకో!

Wednesday, July 4, 2018

చిత్రకవిత- ఊగిసలాడే ఈ బ్రతుకు




ఊగిసలాడే ఈ బ్రతుకు

ప్రతి రోజూ పొద్దున్నే బండేసుకు నాబోటి వారిళ్ళలో
ప్లాస్టిక్ సామాన్లు అమ్మజూస్తా
ఒక్కో రోజు మంచి బేరాలు తగుల్తాయి,
మరో రోజు పెట్రోలు ఖర్చు, పస్తులు!

సినిమా పాట- అదే సీను- అదే ట్యూను- వేరే పాట- పాడవేల రాధికా


పల్లవి : ప్రేమ పొంగి పారెగా
         జాలువారె పాటగా    ||ప్రేమ||

Tuesday, July 3, 2018

Monday, July 2, 2018

చిత్రకవిత- పొగ వదలకు- ప్రాణాన్ని వదులుకోకు




పొగ వదలకు- ప్రాణాన్ని వదులుకోకు
‘నేను గురజాడ వారి అభిమాని’నని
గిరీశాన్ని ఆదర్శంగా తీసుకునే ఓ వెర్రి కుర్రవాడా!
గిరీశం ద్వంద్వ ధోరణి మరిచావా?
‘కన్యాశుల్క’పు వ్యంగ్య వైభవాన్ని విడిచావా?
ధూమపానం చేయకపోతే దున్నపోతై పుట్టుదువు గాక!
కాన్సర్ రోగిలా చచ్చి బతక్కు!

స్వీయ కవిత- Theme- "యువతరం ప్రేమాయణం"--- ఆన్లైన్ ప్రేమ


ఆన్లైన్ ప్రేమ
మొదటి రోజు ఛాటింగు
రెండో రోజు డేటింగు

Wednesday, June 27, 2018

స్వీయ కవిత- Theme-"విదేశీ విద్యా మోజు.......అక్కడ నానా కష్టాలే ప్రతి రోజు"- కష్టే ఫలే


కష్టే ఫలే
విదేశీ విద్యంటే ఎందుకుండదు మోజు?
ఈనాటి మన దేశపు చదువులు మనకు మనోవికాసం కలిగిస్తాయా?
కష్టపడి చదివేవాడికి సరైన ప్రోత్సాహం ఉంటోందా?
వాడి ప్రతిభకు తగ్గ ఉద్యోగం వస్తోందా?
పరీక్షల సీసన్ లో ఏ వార్తా పత్రిక తిరగేసినా, కాపీలు కొట్టే వారి కథలే
చదివినా చదవకపోయినా పై తరగతికి వెళ్ళిపోయి, చదువొచ్చినట్టు భుజాలు ఎగరేయడమే!
ప్రతిభను గుర్తించని చదువు నాకొద్దు

Wednesday, June 20, 2018

చిత్రకవిత- సూర్యుడికి కోపం రాదు మరి?






సూర్యుడికి కోపం రాదు మరి?
వడ దెబ్బ  తట్టుకోలేకపోతున్నావా?
నువ్వెన్ని చెట్లు నరికావో గుర్తు తెచ్చుకో...
ఆ వడ దెబ్బకి నువ్వెంత సాయం చేశావో తెలుసుకో!  

Monday, June 18, 2018

స్వీయ కవిత- Theme-"వైద్యో నారాయణో హరీ..... రొక్కముంటేనే" -సార్థకం



సార్థకం
వైద్యం చేయదానికి రోగి ఉంటే చాలు
అది ఆనాటి మాట
అందుకే వైద్యో నారాయణో హరీ అన్నారు!

Tuesday, June 12, 2018

చిత్రకవిత- నినాదం- నిజం


నినాదం- నిజం
“బాల కార్మిక నిషేధం జరగా”లంటూ
నినాదాలు చేస్తే సరిపోతుందా?
మన చేతలలో నిర్మూలించాలి గాని...
బాలల చేత పనిచేస్తే చౌక అవుతుందని
మనం ఆశ పడినంత వరకూ  
ఈ రక్కసి చేస్తుంది విలయతాండవం!

స్వీయ కవిత- Theme- దేహము నీటి బుగ్గ..... జీవితము నీటి బుడగ...... మెండైన వ్యామోహము ........- ఇదేం వింతో గాని...


ఇదేం వింతో గాని...
నీటి బుగ్గ సలసలా కాగుతోందని అబ్బురపడిపోతాం ...
మన జీవితమే కాగి అవిరవడానికి సిద్ధపడుతోందని గ్రహించం!

Thursday, June 7, 2018

చిత్రకవిత- బరువులేని బాల్యం



బరువులేని బాల్యం
చదువుకునేటప్పుడు చదువుకుని
రకరకాల ఆటలాడుకోవడం ఎంత బాగుంటుందో

Monday, June 4, 2018

స్వీయ కవిత- Theme- ఉప్పొంగిన ఉల్లాసపు సడిలో ఉబికిన కన్నీటి ధారలు



1.   ఓటమినెదుర్కునేందుకు సంసిద్ధమయ్యానానాడు
మరో అవకాశం కోసం ఆగాలి ఆర్నెల్లు
ఆ ఎదురుచూపులలో ఓ శుభోదయాన వరించె నన్ను విజయమ్ము
ఉప్పొంగిన ఉల్లాసపు సడిలో ఉబికెను కన్నీటి ధారలు!

Friday, June 1, 2018

చిత్రకథ-Theme-ప్రేమ ఇద్దరు వ్యక్తులు ఇరువైపులా లాగిపట్టుకున్న రబ్బర్ బ్యాండ్ లాంటిది.ఒకరు విసిగి విడిచిపెడితే అది అవతలవ్యక్తిని బాధ పెడ్తుంది "- యాంత్రిక బంధం


యాంత్రిక బంధం
                       “రబ్బర్ బ్యాండ్ లాగి కొట్టినట్టు ఏమిటా మాట? కావాలంటే నన్ను కొట్టు. మాటలతో కాదు”, అన్నాడు మహేష్, భార్య విమలతో. “నేను అనకూడని మాట అనలేదుగా! విడాకులు తీసుకుందాం”, అంది ఆమె. “మళ్ళీ అదే మాట! సరదాకి కూడా అలాంటి మాట అనకు”, అన్నాడు మహేష్.

Wednesday, May 30, 2018

స్వీయ కవిత- వెన్నెల రేయి అలకేలనోయి- కౌసల్య విన్నపము

కౌసల్య విన్నపము:

చందురుని కోరిన అద్దంలో చూపారు నాన్న
మరిక అన్నం వద్దని మారాము చేసెదవేలా?

చిత్రకవిత-ప్రేమ లాల



ప్రేమ లాల

మబ్బుల మెత్తటి పరుపు లేదు
కాయకష్టం చేసిన నా కాళ్ళే పరుపు.

Wednesday, May 23, 2018

చిత్రకవిత- మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చెయ్యకు




మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చెయ్యకు

మొక్కలు నాటామని లెక్కలు చెప్తే చాలదు
వాటిని సరిగ్గా సాకామా లేదా చూసుకోవాలి
నీళ్ళు మాత్రమే పోస్తే సరిపోదు
కాలుష్యపు పదార్థాలు లేకుండా చూసుకోవాలి.

Wednesday, May 16, 2018

చిత్రకవిత- ఆ కళ్ళు చాలు




ఆ కళ్ళు చాలు
‘అందమే ఆనందం’ అని పాడిన ఈమె అందానికి అందం
ఏమిటో ఆ మాయ! నటనలో చాకచక్యం ఆమె సొంతం

Wednesday, May 2, 2018

చిత్రకవిత- చిట్టితండ్రి



చిట్టితండ్రి
పుట్టింది రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబంలో
ఆకలి అలవాటైన అతనికి, కట్టేందుకు బట్టలు కూడా కరువే!
ఆడిపాడాల్సిన పసితనంలో వయసుకి మించిన భారం మోస్తున్నాడు-
చంకలో ఉన్న తమ్ముడు కాదు, వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత
ఆ పసితతనపు అమాయకత్వం మిగిలిన పిల్లలు వెకిలిగా నవ్వినా పట్టించుకోదు
వాళ్ళకేం తెలుసు, ఆ మనసులో ఏముందో?

చిత్రకవిత- ఆధునిక అన్నపూర్ణ


ఆధునిక అన్నపూర్ణ
పేదరికం పాత విషయమే
ఆకలి కూడా అంతే
ఆకలి గొన్నవారికి కూసింత
బువ్వ పెడితే అన్నపూర్ణ అనేవారు.

Thursday, April 12, 2018

చిట్టి కథ - Sentence- "నాను బతికి సెడిన వోన్ని బాబయా...మీరు సెప్పే పాపం పనులు సేస్తూ సెడి బతకలేను...దండాలండీ" (మాండలికంలో)- ఆత్మస్థైర్యం


ఆత్మస్థైర్యం
అదో మోస్తరు పల్లెటూరు. అందులో పిపీలకం లాంటి వెల్డర్ కాశీ. చేసేవి చిన్నా, చితకా పనులైనా శ్రద్ధగా చేస్తాడు. ఆ కారణంగా ఊళ్ళో మంచి పేరుంది. “నువ్వు చేసే పని దుబాయ్ లో చేస్తే లక్షలకు లక్షలు సంపాదించచ్చు”, అని ఓ పెద్ద మనిషి ఉచిత సలహా ఇస్తే, ఉన్న కాస్త పొలమూ అమ్మేసి, అర్జంటుగా ఓ ఏజెంటు దగ్గరికి వెళ్ళాడు. పూర్వాపరాలు వాకబు చేయని పాపానికి వాడు కాశీని నిలువునా ముంచాడు.

Tuesday, April 10, 2018

చిత్రకవిత- అల్పసంఖ్యాకులు


అల్పసంఖ్యాకులు
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి
చీకట్లో చిరుదీపం వెలిగించి
బండ రాళ్ళని పెళ్ళగించి
ఇంతింత-ఇంతింత బయటకు తెచ్చి
ఆ నల్ల బంగారాన్ని అప్పగిస్తే
అనుకున్నదానికన్నా జీతం తక్కువిచ్చి
నల్లధనాన్ని పెంచుకుంటారొకరు.

Saturday, April 7, 2018

గద్య పూరణము- గుంటూరు శేషేంద్ర శర్మ గారి "నా దేశం నా ప్రజలు" కవితా సంపుటి వరుస



శిక్షణ
1.     పసి పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే పోషక పదార్థాల్లా, శిక్షణకోసం అధికారులు వస్తే, వృత్తిలో ఎదుగుదలకి కావలసిన నైపుణ్యాన్ని ప్రసాదింపజేశాను. పసిపిల్లలకి నీతి కథలు చెప్పినట్టు, వాళ్ళ ఉగ్గుపాలలో విలువల తేనెని కలిపి, తాగించాను.

Friday, March 30, 2018

చిట్టి కథ - Sentence- " తప్పు అయిందని ఒప్పుకున్న తర్వాత కూడా చెప్పుతో కొట్టి మాట్లాడినట్టు బాధించడం గొప్ప సంస్కారమా...చెప్పండి "--అదిగో పులి, ఇదిగో తోక



అదిగో పులి, ఇదిగో తోక
అది 1979వ సంవత్సరం. స్కైల్యాబ్ అనే ఒక ఉపగ్రహం కూలిపోతోందని రేడియోలో ఒకటే హోరు. ‘అదిగో పులి, ఇదిగో తోక' అన్న రీతిలో ఆ వూళ్ళో పడుతుంది, ఈ రాష్ట్రంలో పడుతుంది- అని ఒకటే పుకార్లు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని తికమకలో అంతా ఉన్నారు. కొందరు ఢిల్లీలో పడుతుందన్నారు, మరి కొందరు మద్రాసులో.... ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు....

Wednesday, March 28, 2018

చిట్టి కథ- context- ఆదర్శం



Given Story: 
ఆత్మీయ మిత్రుడు అరవింద్ ఇంటికి వచ్చి శుభలేఖ ఇస్తూ "మీరు కుటుంబ సమేతంగా పెళ్ళికి రావాలి...వీలుచేసుకుని ఓ మూడురోజుల ముందు", అని ఆహ్వానించగానే ఉబ్బితబ్బిబ్బయ్యాడు రాజేష్.  మిత్రుడు ఉండేది ప్రక్క ఊరిలోనే. రెండు గంటల ప్రయాణం. బయల్దేరిన మిత్రుడు అరవింద్ కి వీడ్కోలు చెప్పి ఇంట్లోకి వచ్చి శుభలేఖ విప్పి పెద్ద అక్షరాలతో ముద్రించిన వాక్యాన్ని చదివి గతుక్కుమన్నాడు.... "బహుమతులు స్వీకరింపబడవు".

చిత్రకవిత-నిచ్చెనని పక్కకి పెట్టినట్టు


నిచ్చెనని పక్కకి పెట్టినట్టు

రెక్కలు రెపరెపలాడిస్తూ ఎగిరే పక్షుల సందడి
ఈ నాడు మనకు వినిపించదే ఆ సడి?

Saturday, March 24, 2018

గద్య పూరణము- Theme- Sri Ramanavami- ఏ రీతి కీర్తింతునో రామ


ఏ రీతి కీర్తింతునో రామ

ఏ రీతి కీర్తింతునో రామ
నిన్నే రీతి వర్ణింతునో రామ

Friday, March 16, 2018

చిట్టి కథ- keywords-"విళంబి, ప్రకృతి , మామిడి, కవి సమ్మేళనం , ఉగాది, అక్కా బావ, కొత్త జంట, పచ్చడి , వంటకాలు, తోరణాలు, కొత్త బట్టలు , మిఠాయిలు "


పండుగ- సంస్కృతి- సంస్కారం
                   “సుందరం, మీ అల్లుడు చాలా బుద్ధిమంతుడయ్యా! అమెరికాలో పెరిగిన అబ్బాయైనా, ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడో! అందరినీ తెలుగులో, ‘విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు’, అని పలుకరిస్తూంటే, నా చిన్నతనం గుర్తు వచ్చిందంటే నమ్ము! చిలుకా- గోరింకల్లా కొత్త జంట భలే ముచ్చటొస్తోందోయ్,” మెచ్చుకోలుగా అన్నాడు పరంధామం. “నిజమే బాబాయి గారూ! ఈ అమెరికా వాళ్ళు ఓ పెళ్ళిలో చూసి, మా అమ్మాయిని చేసుకుంటామని ఊదరగొట్టేస్తే నేను, ఉమా కూడా అలాగే భయపడ్డామనుకోండి! కానీ మా బంధువులబ్బాయి ఒకడీమధ్యే వీళ్ళ ఊరెళ్ళాడు చదువు కోసం. వాణ్ణి వీళ్ళ గురించి విచారించామన్నాం. వాడు వెంటనే, వాళ్ళ గురించి ఓ పురాణమే చెప్పాడు. వాళ్ళు ప్రతి పండుగనూ సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారట. ఊళ్ళో ఉండే తెలుగు వాళ్ళని, ఇతర భారతీయులని పిలిచి సాంప్రదాయ వంటకాలతో విందు చేసి, సంస్కృతిపరంగా జరిగే కార్యక్రమాలని కుదిరిన మేరకి నిర్వహిస్తారట. అందుకే ఒప్పుకున్నాం. గొప్ప చెప్పుకుంటే బాగుండదు, మా అల్లుడు మా కోసం కొత్త బట్టలు తెచ్చాడండీ”, అని ముగించాడు సుందరం.

Tuesday, March 13, 2018

చిత్రకవిత- వీళ్ళు తట్టుకోగలరా?


వీళ్ళు తట్టుకోగలరా?
అర్థరాత్రి నుండి మా రోజు ప్రారంభమవుతుంది
మనుషుల్లో శుచీ-శుభ్రం ఉన్నా, లేకపోయినా
వారు చేసిన చెత్తని ఊడ్చి రోడ్లన్నీ శుభ్ర పరుస్తాం

Saturday, March 10, 2018

చిట్టి కథ- keywords- "వదులుకున్న వారిని కలుపుకోవచ్చు...విదిలించి వదిలించుకున్న వారి దరి చేరాలంటే మనసు అంగీకరించాలి"- ‘వృద్ధ పురుషా’


‘వృద్ధ పురుషా’
              “మహేష్ ని ఇవ్వాళ చూశాను. ఆరోగ్యంగానే ఉన్నాడు. నీ గురించి అడిగాడు. నిన్ను వదిలి వెళ్ళినందుకు, పాపం, బాధ పడ్డాడు. నువ్వొప్పుకుంటే నీతో జీవితం పునఃప్రారంభం చేద్దామనుకుంటున్నాడు”, అని ముగించింది అశ్వని. ప్రేమ మాత్రం తొణక లేదు. “ఊహూఁ”, అని ముక్తసరిగా జవాబిచ్చింది. తన మదిలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి, గతం గుర్తుకొచ్చి.

గద్య పూరణము- keywords-"అందమైన హరివిల్లులా"

1.     అందమైన హరివిల్లులాంటి ఆమె అందం
ముగ్ధుణ్ణి చేసింది నన్ను
అందాన్ని పోలిన గుణముందని తెలిసినంతనె
నా ఆనందమంటింది మిన్ను!

Friday, March 9, 2018

గద్య పూరణము- keywords-"-హితుడు ఒక్కడున్న చాలు-----"


1.     “హితుడు ఒక్కడున్న చాలు” నన్న
చద్ది మూట వంటి పెద్దల  మాటను
లెక్కచేయక పెంచుకుంటి నేస్తములన్ అంతర్జాలములో
లెక్కకు తప్ప అక్కరకు రాని వారని తెలిసి క్షోభపడితిన్.